కేంద్ర మంత్రుల బృందం, రైతు సంఘాల నాయకుల మధ్య ఆరో విడత చర్చలు జరిగాయి. ఈసారి కూడా విరామ సమయంలో స్వయంగా తయరు చేసుకుని తెచ్చుకున్న ఆహారాన్నే తిన్నారు రైతులు. అయితే ఈసారి రైతులతో పాటు భోజనం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోం ప్రకాశ్. గత ఐదు దఫాల చర్చల్లో విరామ సమయంలో వారు తెచ్చుకున్న ఆహారాన్నే తీసుకున్నారు అన్నదాతలు. ఈసారి మంత్రులు కూడా వారు తెచ్చిన ఆహారాన్నే తిన్నారు.
తమ అజెండా ప్రకారమే చర్చలు జరుగుతాయని అన్నదాతలు స్పష్టం చేశారు.
దేశంలో పలు ప్రాంతాల్లోని రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువకే తమ పంటను విక్రయిస్తున్నారని పేర్కొన్న కర్షక నేతలు.. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని సమావేశానికి ముందు ఉద్ఘాటించారు. దిల్లీ సరిహద్దుల్లోనే కొత్త సంవత్సర వేడుకలు చేసుకుంటామన్నారు.
ఇదీ చూడండి: రైతుల సంఘాల నేతలతో కేంద్రం చర్చలు