ETV Bharat / bharat

'నక్సలిజంపై విజయం తథ్యం' - కేంద్ర హోం మంత్రి అమిత్​షా

నక్సలిజం నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. జగదల్​పుర్​లో ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు షా. జవాన్ల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉందన్నారు.

Govt determined to end Naxal menace, says HM Amit Shah
'నక్సల్స్​ అణచివేతకు కేంద్రం కట్టుబడి ఉంది'
author img

By

Published : Apr 5, 2021, 2:05 PM IST

నక్సలిజాన్ని రూపుమాపేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమన్నారు. 22 మంది జవాన్ల అమరులైన బీజాపుర్​ ఎన్​కౌంటర్​పై జగదల్​పుర్​లో ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు షా.

" అమర జవాన్ల ధైర్య సాహసాలు, త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు. దేశం మొత్తం వారి కుటుంబాలకు అండగా ఉంటుంది. నక్సలిజాన్ని రూపుమాపేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం. చివరకు గెలిచి తీరతాం. గత కొన్నేళ్లుగా దట్టమైన అటవీ ప్రాంతాల్లోనూ భద్రతా బలగాలు స్థావరాలు ఏర్పాటు చేస్తున్నాయి. దీనిని జీర్ణించుకోలేకే నక్సలైట్లు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు.

-- కేంద్ర హోం మంత్రి అమిత్​ షా

నక్సలైట్లను అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం పనిచేస్తుందన్నారు షా. ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘోల్​, జగదల్​పుర్​లోని ఉన్నతాధికారులతో సమావేశమైనట్లు తెలిపారు. నక్సల్స్​పై పోరాటాన్ని బలోపేతం చేయాలని అధికారులు సూచించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి : అమర జవాన్లకు అమిత్​ షా నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.