ETV Bharat / bharat

'టీకా ఉత్సవాలు సరే.. ఏర్పాట్లేవి? '

author img

By

Published : May 12, 2021, 3:18 PM IST

వ్యాక్సిన్ అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. టీకా ఉత్సవ్ లు జరిపిన ప్రభుత్వం.. వ్యాక్సిన్ అందించే సౌకర్యాలను మాత్రం గాలికి వదిలేసిందని విమర్శించారు. దీని కారణంగానే దేశంలో వ్యాక్సినేషన్ శాతం తగ్గిందని వివరించారు.

Priyanka Gandhi
ప్రియాంక గాంధీ

కరోనా టీకా ఏర్పాట్లపై కేంద్ర ప్రభుత్వ విధానాలను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. టీకా ఉత్సవ్ లు జరుపుకున్న ప్రభుత్వం.. వ్యాక్సిన్ అందించే సౌకర్యాలను మాత్రం ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. దీని కారణంగానే దేశంలో వ్యాక్సినేషన్ శాతం తగ్గిందని వివరించారు.

"టీకాలను భారత్ అత్యధికంగా ఉత్పత్తి చేస్తోంది. ఏప్రిల్ 12న కేంద్రం టీకా ఉత్సవ్ ను ప్రారంభించింది. కానీ వ్యాక్సిన్ అందించే సౌకర్యాలను ఏర్పాటు చేయలేదు. దీని కారణంగా గత 30 రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ 82 శాతం తగ్గింది. వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలను మోదీ సందర్శించి ఫొటోలు దిగారు. కానీ జనవరి 2021లో, చాలా ఆలస్యంగా వ్యాక్సిన్ మొదటి విడత పంపిణీ చేపట్టారు."

-ప్రియాంక గాంధీ , కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ

ఏప్రిల్ 12వ తేదీకి.. మే9వ తేదీకి.. వ్యాక్సినేషన్ ప్రక్రిియలో తగ్గుదలను గ్రాఫ్ ల ఆధారంగా ప్రియాంక గాంధీ వివరించారు. అమెరికా, యూకే, టర్కీ, ఫ్రాన్స్ ల కన్నా భారత్ వెనుకంజలో ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందినప్పుడే వైరస్ పై పోరాడగలమని చెప్పారు.

ఇదీ చదవండి: 'భారత్​లో ఉత్పరివర్తనం చెందిన కరోనా.. 44దేశాల్లో'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.