ETV Bharat / bharat

స్కూల్​ మొత్తానికి ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు టీచర్లు.. రోడ్డు దాటడం రిస్క్ అని ఎవరూ రారట! - durga vidyalaya school

పాఠశాల అంటే విద్యార్థుల అరుపులు, టీచర్ల పాఠాలు, బడి గంటలు ఇలా చాలా ఉంటాయి. కానీ బంగాల్​.. అసన్​సోల్​లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం పరిస్థితి భిన్నం. అక్కడ బడి గంటలు మోగవు.. విద్యార్థుల కేరింతలు పెద్దగా వినబడవు. ఒకప్పుడు 350 మంది పిల్లలతో కోలాహలంగా కనిపించిన ఆ పాఠశాల ప్రస్తుతం విద్యార్థుల లేక వెలవెలబోతోంది. ఎందుకు ఇలా జరిగిందో ఓ సారి చూద్దాం.

Government school in Asansol
విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న టీచర్
author img

By

Published : Feb 9, 2023, 6:55 PM IST

స్కూల్​ మొత్తానికి ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు టీచర్లు.. రోడ్డు దాటడం రిస్క్ అని ఎవరూ రారట!

ఆ పాఠశాలలో విద్యార్థుల కేరింతలు పెద్దగా వినిపించవు. అల్లర్లు కనిపించవు. ఆ స్కూల్​లో ఒకే ఒక తరగతి గది ఉంది. ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వారిలో రెగ్యులర్​గా పాఠశాలకు హాజరయ్యేది ముగ్గురే. వారికి చదువు చెప్పేందుకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ పాఠశాలలో అంత తక్కువ మంది విద్యార్థులు ఉండడానికి కారణమేంటో తెలుసా? ఆ పాఠశాలకు రావాలంటే రద్దీగా ఉన్న రోడ్డును దాటాలి. అలాగే మధ్యాహ్న భోజనానికి వేరే స్కూల్​కు వెళ్లాలి. ఆ స్కూల్ పేరే దుర్గా విద్యాలయ. బంగాల్​లోని అసన్​సోల్​లో ఉంది.

తాల్పుకురియా ప్రాంతంలోని ఈ బడిలో హిందీ మాధ్యమంలో పాఠాలు బోధిస్తారు. ఈ స్కూల్​లో ఒకే ఒక్క తరగతి గది ఉంది. అది కూడా వాడకంలో లేదు. విద్యుత్ సరఫరా, విద్యార్థులు ఆడుకునేందుకు ప్లేగ్రౌండ్​ కూడా లేవు.రికార్డుల ప్రకారం ఈ పాఠశాలలో మొత్తం 11 మంది విద్యార్థులు ఉన్నా పాఠశాలకు హాజరయ్యేది మాత్రం ముగ్గురు నుంచి ఆరుగురే. ఇంత తక్కువ మంది విద్యార్థులు హాజరైనా కూడా వారికి చదువు చెప్పేందుకు ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అన్ని స్కూల్​ల మాదిరిగానే ఈ పాఠశాల నడుస్తున్నా.. విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కూడా పాఠశాలలో తొలగించారు.

Government school in Asansol
పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న టీచర్

నాడు 350 మంది విద్యార్థులు
1927లో స్థాపించిన దుర్గా విద్యాలయ హిందీ మాధ్యమ పాఠశాలలో ఒకప్పుడు 350 మంది విద్యార్థుల ఉండేవారు. వీరందరూ 1 నుంచి 5వ తరగతికి మధ్య చదువుతున్నవారే. వాళ్లందరినీ ఒకే గదిలో ఉంచడం ఉపాధ్యాయులకు కష్టంగా ఉండేది. ఇప్పడు విద్యార్థులు లేక పాఠశాల వెలవెలబోతోంది.

ప్రస్తుతం ఈ పాఠశాలను ఇంఛార్జ్ ఉపాధ్యాయురాలు మంజు కుమారి, బబ్లూ భగత్ అనే ఉపాధ్యాయుడు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల కోసం ఉపాధ్యాయులిద్దరూ పాఠశాలకు చేరుకొని పాఠాలు చెబుతున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఉపాధ్యాయులు ప్రయత్నించినా, తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలకు పంపడానికి ఇష్టపడటం లేదు.

Government school in Asansol
దుర్గా విద్యాలయ

"పాఠశాల ముందు జీటీ రోడ్డు ఉంది. విద్యార్థులు పాఠశాలకు రావాలంటే ఆ రోడ్డును దాటాలి. దీంతో చాలా మంది విద్యార్థులు పాఠశాలకు రావడానికి ఇష్టపడడం లేదు. అలాగే మా స్కూల్ ఐదో తరగతి వరకు ఉంది. ఇతర హిందీ మాధ్యమ పాఠశాలలు ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు ఉన్నాయి. అందుకే ఎక్కువ మంది ఆ పాఠశాలల్లో చేరుతున్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది"

--మంజు కుమారి, టీచర్​

మధ్యాహ్న భోజనం నిలిపివేత..
దుర్గా విద్యాలయలో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టడం వల్ల అధికారులు మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేశారు. ప్రతిరోజు విద్యార్థులను భోజనం కోసం ఉపాధ్యాయులు దగ్గరలోని మరో పాఠశాలకు తీసుకెళ్తారు. పాఠశాలకు వచ్చే, వెళ్లే మార్గమైన జీటీ రోడ్డు రద్దీగా ఉంటున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు.. విద్యార్థులను జాగ్రత్తగా రోడ్డు దాటిస్తుంటారు.

Government school in Asansol
స్కూల్​లో విద్యార్థులు

ఈ పాఠశాల వెనుక రైల్వే అవుట్ హౌస్ ఉంది. రైల్వే అధికారులు అసిస్టెంట్​లు అక్కడ ఎక్కువగా నివసించేవారు. దుర్గా విద్యాలయలో ప్రధానంగా దిగువ తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు, దినసరి కూలీ కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకోవడానికి వస్తారు. రైల్వేశాఖ ఇటీవల అవుట్​ హౌస్​ను తొలగించింది. దీంతో రైల్వే అధికారులతో పాటు వారి సహాయకులు అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే చోటికి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థులు భారీగా తగ్గిపోయారు.

-- బబ్లూ భగత్​, ఉపాధ్యాయుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.