ETV Bharat / bharat

రాష్ట్ర ప్రభుత్వం 'కేజీఎఫ్'​ ప్లాన్​.. వర్కౌట్​ అయితే కనక వర్షమే! - బంగారం గని

Gold exploration: బిహార్​ రాష్ట్ర ప్రభుత్వం కేజీఎఫ్​ తరహాలో బంగారం మైనింగ్​కు ప్రణాళికలు రచిస్తోంది. దేశంలోనే భారీ నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్​ సర్వే తేల్చిన క్రమంలో ఆ దిశగా చర్యలు చేపట్టింది. బంగారం నిల్వల గుర్తింపు, మైనింగ్​ కోసం చర్చలు జరుపుతున్నట్లు సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

GOLD-EXPLORATION
బంగారం మైనింగ్
author img

By

Published : May 29, 2022, 11:02 AM IST

Gold exploration: బిహార్​లోని జముయి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద బంగారం గని ఉందని భారత జియోలాజికల్​ సర్వే తెల్చిన క్రమంలో దానిపై దృష్టి సారించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. బంగారం వెలికితీసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టిందని, మైనింగ్​ చేసేందుకు అనుమతులు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు. జియోలాజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా(జీఎస్​ఐ) జముయి జిల్లాలో సర్వే నిర్వహించింది. దీని ప్రకారం జిల్లాలో 222.88 మిలియన్​ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని తేల్చింది.

"జముయి జిల్లాలోని బంగారం నిల్వలను వెలికి తీసేందుకు.. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ​, జీఎస్​ఐతో పాటు మైనింగ్​ సంస్థలతో బిహార్​ మైన్స్​, జియోలజీ విభాగం చర్చలు జరుపుతోంది. జిల్లాలోని కర్మాటియా, ఝాఝా, సోనో వంటి ప్రాంతంలో బంగారం నిల్వలు ఉన్నాయన్న జీఎస్​ఐ సర్వేపై సమాలోచనలు చేసిన తర్వాతే చర్చల ప్రక్రియ మొదలైంది. నెల రోజుల్లో జీ3 స్టేజ్​ మైనింగ్​ కోసం కేంద్ర ఏజెన్సీలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. కొన్ని ప్రాంతాల్లో జీ2 సాధారణ అనుమతులు సైతం ఇవ్వనుంది."

- హర్జోత్​ కౌర్​ బమ్రా, అదనపు చీఫ్​ సెక్రెటరీ, మైన్స్​ కమిషనర్​.

దేశ బంగారం నిల్వల్లో బిహార్​లోనే అధికంగా ఉన్నట్లు గత ఏడాది లోక్​సభకు తెలిపారు కేంద్ర గనుల​ శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి. మొత్తం 222.885 మిలియన్​ టన్నుల బంగారు ఖనిజం ఉందని, అది దేశంలోని నిల్వల్లో 44 శాతమని రాతపూర్వకంగా తెలిపారు.

ఇదీ చూడండి: ఆమెకు ఒకేసారి 16 గోల్డ్ మెడల్స్.. ప్రభుత్వానికి స్పెషల్ రిక్వెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.