ETV Bharat / bharat

అమెరికన్ నెట్​వర్క్​, డైనర్స్ క్లబ్​పై ఆర్​బీఐ కొరడా - ఆర్​బీఐ ఆంక్షలు అమెరికన్ ఎక్స్​ప్రెస్

మే 1 నుంచి కొత్త వినియోగదారులను చేర్చుకోకుండా కార్డ్ ఆపరేటర్లైన అమెరికన్ ఎక్స్​ప్రెస్, డైనర్స్ క్లబ్​లపై ఆర్​బీఐ ఆంక్షలు విధించింది. వినియోగదారుల సమాచారాన్ని నిల్వ చేయడంలో నిబంధనలు పాటించనందుకు ఈ చర్యలు తీసుకుంది.

AmericanExpress and DinersClub barred by RBI
ప్రముఖ పేమెంట్ ఆపరేటర్లపై ఆర్​బీఐ కొరడా
author img

By

Published : Apr 24, 2021, 4:41 PM IST

అంతర్జాతీయ పేమెంట్ కార్డుల నెట్​వర్క్​లైన అమెరికన్ ఎక్స్​ప్రెస్, డైనర్స్ క్లబ్​లపై రిజర్వు బ్యాంక్ కొరడా ఝులిపించింది. పేమెంట్ వ్యవస్థ సమాచారాన్ని నిల్వ చేయడంలో సరైన నిబంధనలు పాటించని కారణంగా.. ఈ రెండు సంస్థలపై ఆంక్షలు విధించింది. మే 1నుంచి కొత్త వినియోగదారులను చేర్చుకోకూడదని ఆదేశించింది. అయితే ప్రస్తుతం ఉన్న వినియోగదారులపై ఈ ఆంక్షలతో ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది.

ఆర్​బీఐ నిబంధనల ప్రకారం పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు.. తమ వినియోగదారుల పూర్తి సమాచారాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి సంబంధిత వ్యవస్థలో నిక్షిప్తం చేయాలి. ఈ వ్యవస్థలు భారత్​లోనే ఉండాలి. దీంతో పాటు ఈ సమాచారాన్ని ఆర్​బీఐతో పంచుకోవాలి. కంపెనీ బోర్డు ఆమోదించిన ఆడిట్ రిపోర్టును ఆర్​బీఐకి సమర్పించాలి.

ఇదీ చదవండి- సెప్టెంబరు కల్లా కొవావ్యాక్స్‌ టీకా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.