ETV Bharat / bharat

Girl Thrown From Building : గిన్నెకు కాలు తాకిందని బాలికపై దారుణం.. మూడో అంతస్తు నుంచి తోసేసిన మహిళ.. ఆస్పత్రిలో.. - ఆటోలో మైనర్​పై అత్యాచారం

Girl Thrown From Building : తన గిన్నెలకు కాలు తాకిందని బాలికను మూడు అంతస్తుల భవనం మీద నుంచి కిందకు తోసేసింది ఓ మహిళ. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

Girl Thrown From Building
Girl Thrown From Building
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 5:51 PM IST

Girl Thrown From Building : ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో ఓ మహిళ దారుణంగా ప్రవర్తించింది. తన గిన్నెలకు కాలు తాకిందని బాలికను మూడో అంతస్తు నుంచి కిందకు తోసేసింది. దీంతో తీవ్రగాయాలపాలైన బాలికను స్థానికులు.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

అసలేం జరిగిందంటే?
నగరంలోని క్రాసింగ్​ రిపబ్లిక్​ ప్రాంతంలోని సేన్​ విహార్​ కాలనీలో సెప్టెంబర్​ 20వ తేదీన ఈ ఘటన జరిగింది. అనుమానాస్పద రీతిలో 14 ఏళ్ల బాలిక.. మూడో అంతస్తు నుంచి కింద పడినట్లు పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే బాధితురాలని స్థానికులు.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

అయితే రేణు అనే మహిళ తనను కిందకు తోసేసిందంటూ బాధితురాలు చెబుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఇంటి టెర్రస్‌పై ఆడుకోవడానికి తాను వెళ్లినట్లు బాలిక చెప్పింది. మహిళ పాత్రలను అక్కడే ఉంచినట్లు చెప్పింది. తాను ఆడుకుంటుండగా కాలు ఓ పాత్రకు తగిలిందని.. వెంటనే ఆగ్రహించిన మహిళ తనను కిందకు తోసేసిందని పేర్కొంది.
బాధితురాలు మాట్లాడిన వీడియో ఆధారంగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వెంటనే నిందితురాలు రేణును అరెస్ట్​ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని.. తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఆటోలో మానసిక దివ్యాంగురాలపై రేప్​​!
Minor Rape In Auto : మహారాష్ట్ర.. మంబయిలో 14 ఏళ్ల మానసిక దివ్యాంగురాలిని కిడ్నాప్​ చేసి కదులుతున్న ఆటోలో ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడితోపాటు ఆటో డ్రైవర్​ను అరెస్ట్​ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదర్​ ప్రాంతానికి చెందిన బాధితురాలిని ప్రధాన నిందితుడు సల్మాన్​ కిడ్నాప్​ చేశాడు. అనంతరం ప్రకాశ్​ పాండేకు చెందిన ఆటోలోకి ఎక్కించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితులు బాలికను మాల్వాని ప్రాంతంలో వదిలివెళ్లారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులిద్దరినీ రెండు గంటల్లోనే పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఒకే కుటుంబంలోని నలుగురు సూసైడ్​!
Family Suicide In MP : మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విగతజీవులుగా కనిపించారు. బాధితులను మోహన్​ రాఠోడ్​ కుటుంబసభ్యులుగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాంకీ నగర్ ప్రాంతంలో మోహన్​ రాఠోడ్​ అనే వ్యక్తి తన భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం మోహన్ ఇంటి నుంచి ఎటువంటి శబ్దాలు వినిపించకపోవడం వల్ల స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి వచ్చి మోహన్​ ఇంటి తలుపులు బద్దలుకొట్టి చూశారు. లోపలకు వెళ్లగా మోహన్​ ఉరేసుకుని ఉండగా.. అతడి భార్య మమత, కుమారుడు లక్కీ, కుమార్తె కనక్​ ఇంట్లో పడి ఉన్నారు. వారి పెదవులు చుట్టూ నురగలు ఉన్నాయి. దీంతో గతరాత్రి తన కుటుంబసభ్యులకు మోహన్​ విషమిచ్చి చంపి.. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నామని పోలీస్​ అధికారి సుమిత్ అగర్వాల్ తెలిపారు. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.

Girl Raped And Killed : చాక్లెట్​ ఇస్తానని నమ్మించి ఆరేళ్ల బాలికపై హత్యాచారం.. సినీ ఫక్కీలో స్కెచ్​ వేసి నిందితుడు అరెస్ట్​

Girl Killed For Touching Cycle Seat : సైకిల్​ సీట్​ను తాకిందని దారుణం.. ఐదేళ్ల చిన్నారిని గొంతు కోసి హత్య చేసిన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.