ETV Bharat / bharat

టెస్ట్​ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్​.. ఎలాగంటే?

సాధారణంగా ఎవరైనా డ్రైవింగ్​ లైసెన్స్​ పొందాలంటే ఆర్​టీఓ కార్యాలయంలో నిర్వహించే డ్రైవింగ్ టెస్ట్​లో పాస్​ కావాల్సిందే.. అయితే ఎలాంటి టెస్ట్ లేకుండానే డ్రైవింగ్​ లైసెన్స్​ పొందే వెసులుబాటు కేంద్రం కల్పించింది.. ఎలాగో మీరూ తెలుసుకోండి.

driving licence
డ్రైవింగ్ లైసెన్స్
author img

By

Published : Jun 11, 2021, 8:11 PM IST

డ్రైవింగ్​ లైసెన్స్​ పొందాలంటే ముందున్న లక్ష్యం.. రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించే పరీక్ష పాస్​ కావాల్సిందే. అయితే తాజాగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఈ విధానంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. గుర్తింపు పొందిన కేంద్రాల్లో శిక్షణ తీసుకున్నవారు ఆర్​టీఓ కార్యాలయాల్లో ఎలాంటి టెస్ట్​ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్​ పొందవచ్చని ఆదేశాలు జారీ చేసింది.

"గుర్తింపు పొందిన డ్రైవర్​ ట్రెయినింగ్ కేంద్రాల్లో.. నాణ్యమైన డ్రైవింగ్ కోర్సులు, శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణ కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలు పాస్​ అయిన వారు.. ఆర్​టీఓ ఆఫీస్​లో ఎలాంటి టెస్ట్ లేకుండానే లైసెన్స్ పొందవచ్చు. మోటార్ వాహనాల చట్టం,1988 నియమాలకు అనుగుణంగా ఈ కేంద్రాలు శిక్షణ అందిస్తాయి."

-- కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ

తాజా మార్గదర్శకాలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.

దేశంలో నైపుణ్యాలు కలిగిన డ్రైవర్ల కొరత ఏర్పడిందని.. అందువల్లనే రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయని అభిప్రాయపడింది.

ఇదీ చదవండి : ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: వారికి ఫ్రీగా స్మార్ట్​​ ఫోన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.