Ganja Seized In Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలోని మలన్పుర్ పారిశ్రామిక ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 1,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి వచ్చిన ఓ అరటిపళ్ల లారీలో పోలీసులు తనిఖీ నిర్వహించారు. అరటిపళ్ల కింద గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ. 2 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సందీప్ శర్మ, ట్రక్ డ్రైవర్ ముఖేశ్ శర్మతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఝార్ఖండ్‌లోనూ..
Ganja Seized In Jharkhand: ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో 390 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీని విలువ రూ. 40 లక్షలు ఉంటుందన్నారు. ఎన్‌హెచ్33 రాంచీ- పట్నా రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టగా గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ట్రక్కుకు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు ఏపీ నుంచి పట్నాకు వస్తున్నట్లు నిర్ధరించారు.
Brown Sugar Seized In Odisha: ఒడిశాలో కోటి విలువైన బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో భాగంగా దేనకనల్ జిల్లాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. బ్రౌన్ షుగర్ బరువు 1.9 కేజీలు ఉంటుందన్నారు.
2020 నుంచి ఇప్పటివరకు దాదాపు 44 కిలోలకుపైగా బ్రౌన్‌షుగర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది.
ఇదీ చూడండి: తవ్వకాల్లో బయటపడ్డ 1689 పురాతన నాణేలు.. ఎక్కడంటే?