ETV Bharat / bharat

అక్కాచెల్లెళ్లపై ఏడాదిగా అత్యాచారం.. తండ్రిని చంపేస్తామని బెదిరించి.. - Woman Crime in Rajasthan

Gang rape: మైనర్​ అక్కాచెల్లెళ్లపై ముగ్గురు దుండగులు ఏడాదిగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన రాజస్థాన్​​లో వెలుగు చూసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తండ్రిని చంపేస్తామని బాధితురాళ్లను బెదిరించారు.

Gangrape
Gangrape
author img

By

Published : Feb 2, 2022, 7:10 AM IST

Gang rape: రాజస్థాన్​​ చురు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మైనర్​ అక్కాచెలెళ్లపై ముగ్గురు దుండగులు ఏడాదిగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సర్దార్‌షహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది..

ఈ ఘటనపై బాధితురాళ్ల తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేయడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. "ఫిర్యాదుదారుడికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు కాగా.. ఇద్దరు మైనర్​ కూతుళ్లు ఇంట్లోనే ఉంటున్నారు. ఈ ఇద్దరిపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు నిందితులు ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తండ్రిని చంపేస్తామని బెదిరించారు. తన కుమార్తె అసభ్యకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు" అని పోలీసులు తెలిపారు.

జనవరి 31న రాత్రి నిందితులు ముగ్గురు.. బాలికల ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే నిందితులు పారిపోతున్న సమయంలో బాధితురాళ్ల సోదరుడు వారిని వెంబడించాడు. ఈ క్రమంలో ఓ నిందితుడు పట్టుబడగా మిగిలిన ఇద్దరు తప్పించుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: బరాత్​లో కారుపైకి ఎక్కి స్టెప్పులేసిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.