Gang Rape in Thane: మహారాష్ట్ర ఠాణె జిల్లాలో దారుణం జరిగింది. అంబర్‌నాథ్‌లో యువతి(21)పై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం రాయితో తలపై మోది కిరాతకంగా చంపేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బాధితురాలి స్నేహితుడు సూత్రధారిగా వ్యవహరించాడని వెల్లడించారు.
'నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కంపెనీకి లేబర్‌ను పంపించే విషయంలో బాధితురాలు, ఆమె స్నేహితుడి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో నిందితుడు ఆదివారం తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బీరు బాటిల్‌ను పగులగొట్టి పదునైన గ్లాస్‌తో బాధితురాలిని బెదిరించాడు. అనంతరం రాయితో బాధితురాలి తలపై మోది హత్య చేశాడు.' అని పోలీసులు తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: భార్యా పిల్లల్ని చంపి బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య.. అప్పుల వల్లే..