ETV Bharat / bharat

తెలంగాణ స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌కుమార్‌ నామినేషన్

Gaddam Prasad Kumar Nomination Today : తెలంగాణ స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌కుమార్‌ నామినేషన్ వేశారు. నామినేషన్​ కార్యక్రమంలో ఆయనతో పాటు సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. అలాగే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు పాల్గొని మద్దతు తెలిపారు.

Gaddam Prasad Kumar Nomination Today
Gaddam Prasad Kumar
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 2:09 PM IST

Gaddam Prasad Kumar Nomination Today : శాసనసభాపతి పదవి కోసం నామినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. కాగా, కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే మాజీ మంత్రి, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌ అభ్యర్థిగా ఎంపిక చేసింది. దానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. అలాగే ఎంఐఎం సైతం తమ మద్దతును ప్రకటించింది.

కాంగ్రెస్‌ తరఫున మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సభాపతి పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు నామినేషన్‌ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. ఈ ఎన్నికల్లో ఆయన వికారాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీకి కావాల్సిన బలం ఉన్నందున స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ ఎన్నిక లాంఛనం కానునట్లు తెలుస్తోంది.

Gaddam Prasad Kumar Nomination As Telangana Speaker : ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, కూనంనేని సాంబశివరావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు పాల్గొన్నారు. అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రి, ప్రతిపక్షం నుంచి కేటీఆర్ గడ్డం ప్రసాద్‌ను ప్రతిపాదిస్తూ నామినేషన్‌పై సంతకం చేశారు. కాంగ్రెస్‌ ఎల్పీ సమాచారంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఎన్నికకు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం దూరంగా ఉన్నారు.

తెలంగాణ ప్రొటెం స్పీకర్​గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం

Telangana Assembly Speaker Election 2023 : కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్​కు ప్రతిపక్షాలు సైతం మద్దతివ్వడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సభాపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో దళితులకు పెద్దపీట వేస్తున్నామనే సమాచారాన్ని కాంగ్రెస్‌ ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే సభాపతిగా ప్రసాద్‌ నియమితులైతే రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్‌ ఆయనే కానుండడం విశేషం. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. గురువారం సభాపతిని ఎన్నుకుని శాసనసభ సమావేశాలను ప్రారంభించనున్నారు.

Telangana Assembly Sessions in December 2023 : ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికల నామినేషన్‌ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. గురువారం సభాపతితో ప్రస్తుతం ప్రొటెం స్పీకర్‌గా ఉన్న అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రమాణం చేయిస్తారు. తదనంతర ప్రక్రియగా కొత్త ప్రభుత్వంలో శాసన సభా సమావేశాలను ప్రారంభించనున్నారు.

15న గవర్నర్ తమిళిసై ప్రసంగం : సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే అంశంపై బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈనెల 15వ తేదీన ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 16వ తేదీన శాసనసభలో, మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పెట్టి చర్చిస్తారు. 17వ తేదీన సైతం సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం.

తెలంగాణ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ గురి - బరిలో దిగేందుకు ఆశావహలు రెడీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.