ETV Bharat / bharat

కళకు ప్రాణం పోస్తున్న కానిస్టేబుల్

అందరిలోనూ ఏదో ఓ కళ ఉండే ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థితి అనుకూలించకో.. లేదా మరేదైనా కారణంతోనో ఆ ఆసక్తికి దూరమవుతారు చాలామంది. కానీ, బంగాల్​కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. తనలోని కళకు ప్రాణం పోస్తున్నారు. ఇంతకీ ఆయనెవరు? ఏం చేస్తున్నారు?

Full time Police-man Part time craftsman, inspiring story of constable from Raiganj
విధులు నిర్వర్తిస్తూనే.. కళకు ప్రాణం పోస్తూ!
author img

By

Published : Nov 25, 2020, 4:06 PM IST

కళకు ప్రాణం పోస్తున్న కానిస్టేబుల్

రోజంతా దొంగలు, నేరగాళ్లతో ఉంటూ.. ఆయన విధులు నిర్వర్తిస్తారు. ఇంటికి రాగానే.. తన పిల్లలతో సమయం గడపాల్సి ఉంటుంది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్యలోనూ తనలోని కళను మాత్రం వదులుకోలేదాయన. పనికిరాని చెక్కముక్కలు, రాళ్లు.. ఇంకా మరే వస్తువైనా సరే... ఆయన చేతిలో పడిందంటే అద్భుతమైన రూపంలోకి మారాల్సిందే. ఆయనే బంగాల్​లోని రాయ్​గంజ్​కు చెందిన కానిస్టేబుల్​ విప్లవ్​ కుమార్​ దాస్.

Full time Police-man Part time craftsman, inspiring story of constable from Raiganj
విప్లవ్​ రూపొందించిన కళాకృతి

ఇస్లామ్​పుర్​కు చెందిన విప్లవ్​ కుమార్​.. ఉద్యోగరీత్యా రాయ్​గంజ్​లో నివసిస్తుంటారు. ఆయన భార్య ఉపాధ్యాయురాలు. విప్లవ్​కు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడమంటే ఆసక్తి. కానీ, తన ఆర్థిక పరిస్థితి కారణంగా ఆ ఇష్టాన్ని మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. అయినప్పటికీ.. తనలో ఉన్న కళాకారుడు మాత్రం ఊరికే ఉండిపోలేదు. చిత్రాలు వేయలేకపోయినా.. పనికిరాని వస్తువులతో కళాఖండాలను తీర్చిదిద్దుతున్నారు విప్లవ్. రాళ్లు, చెక్కలతో మొహెంజొదారో కాలానికి చెందిన ఓ నృత్యకారిణిని సృష్టించారు. గోడ గడియారాన్ని జింక ముఖాకృతిలోకి మార్చారు.

చెక్కముక్కలతో నౌక

" నా చిన్నప్పటి నుంచి హస్తకళలు అంటే అమితమైన ఆసక్తి. కానీ, నేను పోలీసు ఉద్యోగంలో చేరాక.. దానిపై ఎక్కువగా దృష్టిపెట్టలేకపోయాను. అప్పుడే భిన్నమైన వస్తువులతో నా కళకు పదును పెడితే బాగుంటుంది కదా అనిపించింది. అందుకే పనికిరాని వస్తువులైన రాళ్లు, కర్రలు వంటి వాటిని బొమ్మలుగా మలుస్తున్నాను. అంతకుముందు మా గురువు.. చెక్కముక్కలతో పాత్రను తయారు చేయడం చూశాను. ఆ స్ఫూర్తితో నేను ఈ చిత్రాలను రూపొందిస్తున్నాను. నా పిల్లలు ఈ కళపై ఆసక్తి చూపిస్తే భవిష్యత్​లో వారికీ నేర్పిస్తాను.

-- విప్లవ్​ కుమార్​ దాస్​, పోలీస్​ కానిస్టేబుల్​.

కళాకృతిని తీర్చిదిద్దుతున్న విప్లవ్​ కుమార్​

ఇదీ చూడండి:వీడియో వైరల్​: జనావాసాల్లో చిరుత సంచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.