ETV Bharat / bharat

Student Murder: దారుణం.. ఏపీలో నాలుగో తరగతి విద్యార్థి హత్య - Fourth Class Student Murder in Hostel

Student Murder
నాలుగో తరగతి విద్యార్థి హత్య
author img

By

Published : Jul 11, 2023, 7:59 AM IST

Updated : Jul 11, 2023, 11:56 AM IST

07:56 July 11

గిరిజన సంక్షేమశాఖ వసతిగృహంలో దారుణం

Fourt Class Student Murder: ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. విద్యార్థి మరణ వార్త విన్న తల్లిదండ్రులు రోదనలు అకాశన్నంటాయి. చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రులకు విద్యార్థి మరణంతో తీరని కన్నీరే మిగిలింది.

ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని.. పులిరామన్నగూడెంలోని గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఉంటూ గోగుల అఖిల్​ అనే విద్యార్థి నాలుగో తరగతి చదువుతున్నాడు. అయితే నాలుగో తరగతి చదువుతున్న అఖిల్​ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. సోమవారం అర్థరాత్రి తర్వాత విద్యార్థి హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విద్యార్థి హత్య సమాచారం తెలుసుకున్న బుట్టాయగూడెం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అఖిల్​ను ఎవరు, ఎందుకు హత్య చేశారనే విషయాలు ఇంకా తెలియరాలేదు. దీంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి హత్య గురించి వసతి గృహ సిబ్బంది మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని ముగ్గురు యువకులు వసతిగృహంలోకి వచ్చి.. అఖిల్​ను బయటకు తీసుకువెళ్లరాని తోటి విద్యార్థులు వివరించారు. తెల్లవారి లేచి చూసేసరికి అఖిల్​ మరణించి ఉన్నట్లు తెలిపారు.

అఖిల్​ మరణవార్త విన్న తల్లిదండ్రులు గుండెలావిసేలా రోదించారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుకుంటున్నామని.. చదువుకుని గొప్ప స్థానాలకు చేరుకుంటాడని ఆశ పడ్డామని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. విద్యార్థి మరణంతో అతని స్వగ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.

Last Updated : Jul 11, 2023, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.