ETV Bharat / bharat

రామమందిర ట్రస్టు ఖాతా నుంచి అక్రమంగా నిధుల మళ్లింపు

రామమందిర తీర్థక్షేత్ర ట్రస్టు ఖాతా నుంచి అక్రమంగా రూ.6లక్షలు దారిమళ్లించిన నలుగురిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ చెక్కులు సృష్టించిన వీరు సంతకాలు ఫోర్జరీ చేసి కుంభకోణానికి యత్నించారు.

Four men held for siphoning off Rs 6L from Ram Mandir Trust's bank account
రామమందిర ట్రస్టు ఖాతా నుంచి అక్రమంగా నిధుల మళ్లింపు
author img

By

Published : Dec 29, 2020, 10:20 PM IST

నకిలీ చెక్కులు సృష్టించి అయెధ్య రామ మందిర ట్రస్టు ఖాతా నుంచి రూ.6లక్షలను మరో బ్యాంకు ఖాతాలోకి దారిమళ్లించిన నలుగురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరిని ముంబయి, ఠాణెకు చెందిన వారుగా గుర్తించారు. ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ట్రస్టు పేరు మీదున్న స్టేట్​ బ్యాంక్ ఆఫ్​​ ఇండియా ఖాతా నుంచి పంజాబ్​ నేషనల్​ బ్యాంకు ఖాతాలోకి రూ.2.5లక్షలు, రూ.3.5లక్షలను సెప్టెంబర్​లో అక్రమంగా దారిమళ్లించారని, దీని కోసం రెండు నకిలీ చెక్కులు సృష్టించి, రామాలయ ట్రస్టు సభ్యులు సంతకాలు ఫోర్జరీ చేసినట్లు అయోధ్య డీఐజీ దీపక్​ కుమార్ వెల్లడించారు. రెండుసార్లు సఫలమైన తర్వాత మూడోసారి రూ.9.86లక్షలను బ్యాంక్​ ఆప్ బరోడా ఖాతాలోకి మళ్లించేందుకు ప్రయత్నించారని, ఇంత భారీ మొత్తం చెక్కును చూసిన బ్యాంకు అధికారులు ట్రస్టు ఛైర్మన్​కు ఫోన్ చేయగా అసలు విషయం బయటపడిందని వివరించారు.

తాను ఎలాంటి చెక్కుపై సంతకం చేయలేదని ట్రస్టు కార్యదర్శి చంప్​తాయ్​ బ్యాంకు అధికారికి చెప్పిన వెంటనే లావాదేవీలను నిలిపివేశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రశాంత్​ మహవాల్ శెట్టి, విమల్ లల్లా, శంకర్ సీతారం గోపాల్, సంజయ్ తేజ్​రాద్​లను అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్​ 10నే అయోధ్య కోత్వాలా పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

ఈ కుంభకోణంలో బ్యాంకు అధికారుల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.