16ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా చిత్రీకరించిన వీడియోను.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని బాధితురాలిని బెదిరించారు.
ఉత్తర్ప్రదేశ్లో నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్మాయి బంధువు కూడా నిందితులలో ఉండడం గమనార్హం.
"ఓ బాలికపై ఆమె బంధువు, మరో ముగ్గురు యువకులు నెలరోజుల క్రితం అత్యాచారం చేశారు. ఏప్రిల్2న బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించగా ఆమె సోదరుడు కాపాడాడు."
-మనోజ్ కుమార్ సింగ్, ఎస్హెచ్ఓ
కాగా, ఆ నలుగురు వ్యక్తులపై పోక్సో కింద కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: మహిళ ఆత్మహత్య- అత్తవారింటికి బంధువులు నిప్పు