ETV Bharat / bharat

తృణమూల్​లోకి కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్​ సిన్హా - tmc yashwant sinha

కేంద్ర మాజీ మంత్రి, భాజపా మాజీ​ నేత యశ్వంత్​ సిన్హా.. తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ)లో చేరారు. కోల్​కతాలోని టీఎంసీ భవన్​లో ఆ పార్టీ‌ కండువా కప్పుకున్నారు. గతంలో భాజపా హయాంలో కేంద్ర మంత్రిగా రెండు సార్లు సేవలందించారు.

Former Union Minister Yashwant Sinha joins TMC
తృణమూల్​లో చేరిన కేంద్ర మాజీ మంత్రి
author img

By

Published : Mar 13, 2021, 1:58 PM IST

Updated : Mar 13, 2021, 2:27 PM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, భాజపా మాజీ నేత యశ్వంత్‌ సిన్హా శనివారం.. తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఉదయం కోల్‌కతాలోని టీఎంసీ భవన్‌లో ఆ పార్టీ నేతల సమక్షంలో తృణమూల్‌ కండువా కప్పుకున్నారు. మమతపై జరిగిన దాడి కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

టీఎంసీలోకి భాజపా మాజీ నేత యశ్వంత్​ సిన్హా

"గతంలో ఎన్నడూ లేని వింత పరిస్థితిని దేశం ఇప్పుడు ఎదుర్కొంటోంది. వ్యవస్థల బలంపైనే ప్రజాస్వామ్య శక్తిసామర్థ్యాలు ఆధారపడి ఉంటాయి. కానీ నేడు దేశంలో న్యాయవ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. వాజ్‌పేయీ హయాంలోని భాజపా ప్రభుత్వం ఏకాభిప్రాయ విధానాలను విశ్వసించేది. కానీ నేటి ప్రభుత్వం 'అణచివేత-విజేత' ధోరణిని నమ్ముతోంది. అందుకే అకాళీదళ్, బిజు జనతాదళ్‌ వంటి పార్టీలు ఎన్డీఏను వీడాయి."

-యశ్వంత్​ సిన్హా

Former Union Minister Yashwant Sinha joins TMC
తృణమూల్​ కండువా కప్పుకున్న కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్​ సిన్హా

83 ఏళ్ల యశ్వంత్ సిన్హా గతంలో సుదీర్ఘకాలం జనతాదళ్‌, భాజపాలో పనిచేశారు. భాజపా హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రిగానూ వ్యవహరించారు. అయితే సొంతపార్టీపైనే బహిరంగ విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన సిన్హా.. 2018లో భాజపాను వీడారు. ఆ తర్వాత కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న ఆయన.. బంగాల్‌ ఎన్నికల సమయంలో తృణమూల్‌ పార్టీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొద్ది నెలలుగా బంగాల్‌లో అనేక మంది తృణమూల్‌ నేతలు భాజపాలో చేరిన తరుణంలో టీఎంసీలోకి సిన్హా రాక ఆ పార్టీకి కలిసొచ్చే పరిణామమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ప్రధాని మోదీ కృషితో.. భాజపాదే విజయం'

Last Updated : Mar 13, 2021, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.