రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సిద్ధాంతకర్త, తొలి అధికార ప్రతినిధి, సీనియర్ నేత మాధవ్ గోవింద్ వైద్య (97) కన్నుమూశారు.
మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు తుది శ్వాస విడిచినట్లు ఆయన మనుమడు విష్ణు వైద్య తెలిపారు. ఆయన గతంలో కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నట్లు చెప్పారు. శుక్రవారం అకస్మత్తుగా ఎంజీ వైద్య ఆరోగ్యం విషమించినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: '200 స్థానాలు గెలుస్తాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'