ETV Bharat / bharat

జార్జియా నుంచి వచ్చి సర్పంచ్​గా విక్టరీ.. డాక్టర్​ కావాలనుకొని చివరకు.. - georgia sarpanch maharashtra

డాక్టర్ కావాలనుకొని ఆమె విదేశాలకు వెళ్లారు.. కానీ అనూహ్యంగా ఆమె ప్రజాసేవలోకి దిగాల్సి వచ్చింది.. కుటుంబానికి రాజకీయం కొత్తేం కాదు.. ఆ ధైర్యంతో స్వదేశానికి తిరిగొచ్చిన 21ఏళ్ల యువతి.. సర్పంచ్​గా గెలుపొందారు. మహారాష్ట్రలో జరిగిందీ ఘటన. మరోవైపు, ఓ కూరగాయల విక్రేత సైతం సర్పంచ్​గా గెలవగా.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడి కుమార్తె మిశ్రమ ఫలితాలు అందుకున్నారు.

Foreign return girl sarpanch
Foreign return girl sarpanch
author img

By

Published : Dec 21, 2022, 4:24 PM IST

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువతి.. స్వదేశానికి వచ్చి సర్పంచ్​గా గెలుపొందారు. మహారాష్ట్రలోని మిరాజ్ (సంగ్లీ) జిల్లాలోని వడ్డి గ్రామ సర్పంచ్​గా ఎన్నికయ్యారు. గ్రామానికి చెందిన యశోదర రాజే శిందే(21).. మూడేళ్ల నుంచి జార్జియాలో ఉంటున్నారు. ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్నారు. చదువు మధ్యలో ఉండగానే సర్పంచ్ ఎన్నికల కోసం స్వదేశానికి వచ్చి ఎన్నికల బరిలోకి దిగారు. పంచాయతీ ఎన్నికలకు ముందు గ్రామంలో శిందే కుటుంబం.. రేణుకాదేవి గ్రామ్ వికాస్ సర్కార్ ప్యానెల్​ ఏర్పాటు చేసుకొంది. అయితే, సర్పంచ్​గా ఎవరిని నిలబెట్టాలని తొలుత సమాలోచనలు జరిపింది. చివరకు మహేంద్ర సింగ్ శిందే కుమార్తె యశోదర రాజేను ఎంపిక చేశారు. ఆమెనే ఎన్నికల్లో నిలబెట్టాలని నిర్ణయించారు.

శిందే కుటుంబం దశాబ్దాలుగా ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంది. వడ్డి గ్రామానికి పక్కనే ఉన్న నర్వాడ్ పంచాయతీకి యశోదర రాజే ముత్తాత 25 ఏళ్ల పాటు సర్పంచ్​గా పనిచేశారు. నాయనమ్మ మందాకిని రాజే శిందే సైతం నర్వాడ్ సర్పంచ్​గా ఐదేళ్లు సేవలందించారు. యశోదర రాజే తండ్రి మహేంద్ర సింగ్ శిందే సైతం రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వారసురాలిగా యశోదరను గ్రామస్థులు సర్పంచ్​గా నిలబెట్టాలని భావించారు. దీంతో ఎన్నికల్లో నిలబడటం, గెలవడం అన్నీ చకచకా అయిపోయాయి. పెద్దగా సన్నద్ధత లేకుండానే బరిలోకి దిగారు యశోదర. ప్రచారంలో స్థానికుల నుంచి సానుకూల స్పందన అందుకున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న జకీర్ వాజిర్​పై 149 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Foreign return girl sarpanch
విజయం అనంతరం విక్టరీ సింబల్ చూపిస్తున్న యశోదరరాజే

"నా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయడం కష్టం కాలేదు. కుటుంబం, గ్రామస్థుల మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధించగలిగాను. ఈ విజయం వారిదే. మేం ఇచ్చిన హామీలన్నింటినీ ఐదేళ్లలో నెరవేరుస్తాం. మంచి సౌకర్యాలతో పాఠశాలలు నిర్మిస్తాం. అధునాతన విద్య అందిస్తాం. ఈ-లెర్నింగ్​ను ప్రవేశపెడతాం. విదేశాల్లో మాదిరిగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం."
-యశోదర రాజే

సర్పంచ్​గా గెలిచినప్పటికీ తన చదువును వదిలిపెట్టనని యశోదర చెబుతున్నారు. ఆన్​లైన్ తరగతులకు హాజరై కోర్సు పూర్తి చేస్తానని తెలిపారు. "జార్జియాలోని న్యూ విజన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేస్తున్నా. ప్రస్తుతం నాలుగో సంవత్సరంలో ఉన్నా. ఇంకో ఏడాదిన్నర కోర్సు పూర్తి చేయాల్సి ఉంది. గ్రామస్థులు నన్ను నిలబెట్టాలని నిర్ణయించేసరికి స్వదేశానికి వచ్చా. ఆన్​లైన్ ద్వారా మిగిలిన చదువు పూర్తి చేస్తా. నా స్నేహితులు సహాయం తీసుకుంటా" అని యశోదర రాజే స్పష్టం చేశారు.

కూరగాయల విక్రేతకు పట్టం..
మహారాష్ట్రలో 7,682 గ్రామ పంచాయతీలకు డిసెంబర్ 18న ఓటింగ్ జరగ్గా.. మంగళవారం ఫలితాలు వెల్లడయ్యాయి. కొల్హాపుర్ జిల్లాలో ఓ కూరగాయల విక్రేత సైతం ఎన్నికల్లో విజయం సాధించారు. షాహువాడి తాలుకాలోని వారేవాడి గ్రామానికి చెందిన ఆనంద రామచంద్ర భోస్లె.. శివాజీ యూనివర్సిటీ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. గ్రామంలో కూరగాయల షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. శివసేన ఠాక్రే వర్గం మద్దతుతో బరిలోకి దిగిన ఆయన.. సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించారు.

vegetable seller become Sarpanch
కూరగాయల విక్రేత ఆనంద రామచంద్ర భోస్లె

భాజపా అధ్యక్షుడి కుమార్తెకు షాక్!
గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్ కుమార్తెకు ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. జలగావ్ జిల్లాలోని మొహాది గ్రామంలో 10 స్థానాలకు పోటీ చేసిన భావినీ పాటిల్ వర్గం.. ఏడింటిలో ఓటమి చవిచూసింది. భావిని ఓ స్థానం నుంచి గెలుపొందగా.. ఆమె ప్యానెల్​కు చెందిన మరో ఇద్దరు విజయం సాధించారు. అయితే, పంచాయతీలో అధికారం మాత్రం దక్కించుకోలేకపోయారు. గతంలో మొహాది స్థానం సర్పంచ్​గా పనిచేశారు భావిని. అయితే, ఈసారి ఈ గ్రామం ఎస్సీ రిజర్వుడ్ కోటాలోకి చేరింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.