ETV Bharat / bharat

నాడు 'గో కరోనా గో'.. నేడు 'నో కరోనా నో'

'గో కరోనా.. గో' ఉపదేశంతో వార్తల్లోకెక్కిన కేంద్ర సామాజికన్యాయ శాఖ సహాయమంత్రి రాందాస్ అఠవాలే కొత్త నినాదం ఇచ్చారు. బ్రిటన్​ నుంచి కొత్తగా స్ట్రెయిన్​ వైరస్​ వ్యాపిస్తున్న నేపథ్యంలో 'నో కరోనా.. నో కరోనా' స్లోగన్​కు పిలుపునిచ్చారు.

For Athawale, 'Go Corona Go' is passe; it is 'No Corona' now
నాడు 'గో కరోనా గో'.. నేడు 'నో కరోనా'
author img

By

Published : Dec 28, 2020, 5:43 AM IST

బ్రిటన్‌ నుంచి కొత్త రకం కరోనా స్ట్రెయిన్​ వ్యాపిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రి రాం‌దాస్ అఠవాలే 'నో కరోనా.. నో కరోనా' అంటూ ఆదివారం కొత్త నినాదం ఇచ్చారు. గతంలో తాను ఇచ్చిన 'గో కరోనా.. గో కరోనా' నినాదం పని చేసిందని, ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడుతోందని అన్నారు.

ప్రస్తుతం స్ట్రెయిన్​ వ్యాప్తి నేపథ్యంలో.. పాతది, కొత్తది ఏ కరోనా మనకొద్దు అంటూ నినాదం ఇచ్చారు.

''ఇంతకు ముందు నేను 'గో కరోనా.. గో' అనే నినాదం ఇచ్చాను. ఇప్పుడు కరోనా వెళ్లిపోతోంది. అది నా దగ్గరికి కూడా వచ్చింది. కరోనా పాజిటివ్​ రావడంతో ఆస్పత్రిలో కూడా చేరాను. అది నా దగ్గరికి రాదనుకున్నా. కానీ.. కరోనా ఎక్కడికైనా వెళ్లగలదు.

ఇప్పుడు కొత్త కరోనా వైరస్​ స్ట్రెయిన్​ కోసం 'నో కరోనా, నో కరోనా' నినాదం ఇస్తున్నా. దీనితో పాత కరోనా లేదా స్ట్రెయిన్​ వైరస్​ మనకు సోకకూడదని ఆశిస్తున్నా.''

- రాందాస్​ అఠవాలే, కేంద్ర మంత్రి

అక్టోబర్​ 28న అఠవాలే కరోనా బారినపడ్డారు. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన 10 రోజుల అనంతరం కోలుకొని బయటికి వచ్చారు.

ఇదీ చూడండి: కేంద్రమంత్రి అఠవాలేకు కరోనా పాజిటివ్

వీడియో వైరల్​..

ది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ) నాయకుడైన అఠవాలే.. చైనా ప్రతినిధి, బౌద్ధ సన్యా సులతో కలిసి పాల్గొన్న ఓ ప్రార్థన సమావేశపు వీడియో బాగా వైరల్ అయింది. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద చిత్రీకరించిన ఆ వీడియోలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు 'గో కరోనా.. గో కరోనా' అంటూ అఠవాలేతో పాటు అందరూ కేకలు పెడతారు.

ఇదీ చూడండి: కేంద్రంలో భాజపా మిత్రపక్షాల ప్రతినిధి ఆయనొక్కరే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.