ETV Bharat / bharat

చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చెరువులో పడి మృతి చెందారు. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది. ఒకరిని రక్షించడానికి మరొకరు దూకి అందరూ ప్రాణాలు విడిచారని పోలీసులు తెలిపారు.

five people dead
ఐదుగురు మృతి
author img

By

Published : Aug 21, 2022, 9:21 PM IST

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఆదివారం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చెరువులో మునిగి మృతి చెందారు. ముంబయికి 630 కిలోమీటర్ల దూరంలోని నాందేడ్ జిల్లాలోని కంధర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవరంగ్‌పురా ప్రాంతంలో మధ్యాహ్నం 2.45 గంటలకు ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బడి దర్గా వద్ద ప్రార్థనలు చేసేందుకు వెళ్లారు. తిరిగి వస్తూ దాదాపు మధ్యాహ్నం 2.45 గంటలకు కంధర్ చెరువు వద్ద భోజనాలు చేయడానికి ఆగారు. అందులో ఒకరు టిఫిన్ బాక్స్ కడగడం కోసం చెరువు దగ్గరికి వెళ్లారు. ఈ క్రమంలోనే అనుకోకుండా నీటిలో పడిపోయారు. ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరు కుటుంబ సభ్యులు చెరువులోకి దూకారు. వీరంతా మునిగిపోవడం చూసి.. ఒడ్డున ఉన్న మరో ఇద్దరూ నీళ్లలోకి దూకారు. ఈ ఘటనలో అందరూ మృతి చెందారని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి

12ఏళ్ల బాలికకు కడుపు నొప్పి, ఆస్పత్రికి వెళ్తే ప్రసవం, రేపిస్ట్ కోసం వేట

ఎయిర్​పోర్ట్​లో రూ.60 కోట్లు విలువైన డ్రగ్స్​​​ సీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.