Mass suicide in Bihar: బిహార్ సమస్తిపుర్‌లో ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడింది. 50 ఏళ్ల మనోజ్ ఝా అనే వ్యక్తి సహా అతడి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు సీలింగ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విద్యాపతి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌ గ్రామానికి చెందిన మనోజ్ ఝా ఆటో నడిపేవారు. దీంతో పాటు గుట్కా వ్యాపారం కూడ చేసేవారు. అతడి సోదరుడి వివాహం కోసం పలువురి వద్ద అప్పులు చేశారు ఝా. ఆర్థిక ఇబ్బందులు అధికమవడం వల్ల ఆత్మహత్య చేసుకున్నారు.
ఉదయమైనా తలుపులు తెరవకపోవడం వల్ల స్థానికులకు అనుమానం వచ్చి చూడగా శవాలై కనిపించారు. మృతులను ఝా తల్లి సీతాదేవి(67), భార్య సుందరమణి(38), కుమారులు సత్యం(10), శివం(7) గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వివాహితను అపహరించి అత్యాచారం: వివాహితను అపహరించి అత్యాచారం చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. గడ్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 27 ఏళ్ల చందన్ పాండే.. బంసిద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని 24 ఏళ్ల వివాహితను మే 17న అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై మే 23న పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరిఖర గ్రామంలోని ఓ హోటల్లో అతడిని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: లోయలోకి దూసుకెళ్లిన యాత్రికుల బస్సు.. 22 మంది మృతి