ETV Bharat / bharat

'మానవ రహిత అంతరిక్ష యాత్ర ఈ ఏడాది అసాధ్యం' - ఇస్రో గగన్​యాన్​ న్యూస్​

మొట్టమొదటి మానవ రహిత అంతరిక్ష యాత్ర ఈ ఏడాది సాధ్యం కాదని ఇస్రో ఛైర్మన్​ కే శివన్​ స్పష్టం చేశారు. వచ్చే ఈ ఏడాది మిషన్​ను చేపట్టనున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితులే ఇందుకు కారణమన్నారు.

First uncrewed mission of Gaganyaan programme not possible in Dec: ISRO
'మానవ రహిత అంతరిక్ష యాత్ర ఈ ఏడాది అసాధ్యం'
author img

By

Published : Jul 26, 2021, 2:31 PM IST

గగన్​యాన్​లో భాగంగా ముందుగా అనుకున్నట్లు మానవ రహిత అంతరిక్ష యాత్రను ఈ ఏడాది డిసెంబర్​లో చేపట్టడం సాధ్యం కాదని ఇస్రో ఛైర్మన్ కే శివన్​ అధికారికంగా ధ్రువీకరించారు. ఈ మిషన్​ను వచ్చే ఏడాది(2022) ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కరోనా సంక్షోభం కారణంగా తలెత్తిన పరిస్థితుల వల్లే ఈ ప్రయోగం ఆలస్యమవుతున్నట్లు చెప్పారు.

బెంగళూరు కేంద్రంగా ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో.. ఈ ఏడాది డిసెంబర్​లో మొట్ట మొదటి మానవ రహిత అంతరిక్ష యాత్ర​ను చేపట్టాలని భావించింది. అయితే కరోనా ప్రభావం పరిశ్రమలపై తీవ్రంగా పడటం వల్ల ఈ మిషన్​కు అవసరమైన హార్డవేర్​ సరఫరా నిలిచిపోయిందని ఇస్రో వర్గాలు తెలిపాయి. అందుకే ఈ ప్రయోగం వాయిదా వేయడం అనివార్యమైందని పేర్కొన్నాయి.

మూడేళ్ల క్రితం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మానవ సహిత గగన్​యాన్​ మిషన్​ను ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం 2022 నాటికి అంతరిక్షంలోకి ముగ్గురు వ్యోమగాములను సుమారు 5-7 రోజుల పాటు పంపాలని గగన్​యాన్​ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. దాని ప్రకారమే ఇస్రో ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా ముందుగా రెండు మానవ రహిత మిషన్లు చేపట్టాలని నిర్ణయించారు. తొలి మానవ రహిత మిషన్​ 2020 డిసెంబర్​, రెండోది 2021 జూన్​లో చేపట్టాలని అనుకున్నారు. మరో ఆరు నెలల అనంతరం తుది మిషన్​ మానవ సహిత గగన్​యాన్​ను 2021, డిసెంబర్​లో చేపట్టేందుకు ప్రణాళిక రచించారు. అయితే కరోనా కారణంగా ఇవన్నీ అనుకున్నట్లు జరగలేదు.

ఇదీ చూడండి: కర్ణాటకలో సీఎం మార్పు- అసలు కారణమిదే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.