కర్ణాటకలోని కలబురిగిలో.. ఓ ఐదేళ్ల బాలుడు పీఠాధిపతిగా నియమితుడై.. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. హిరేమత్ సంస్థానానికి చెందిన పీఠాధిపతి శివబసవ శివచార్య.. సోమవారం గుండెపోటుతో మరణించారు. ఆ స్థానంలో.. అతడి సోదరుడు గురుంజనయ్య కుమారుడు నీలకంఠ(5)ను, కలుగా మఠానికి నూతన పీఠాధిపతిగా నియమించారు.
చరిత్రలో మొదటిసారి..
వేద పండితుల సమక్షంలో మంగళవారం నియామక ప్రక్రియను ఘనంగా జరిపారు. పీఠాధిపతి స్థానం ఖాళీగా ఉంచలేమంటూ.. ఆ మేరకు నూతన నియామకం జరిపినట్లు పండితులు స్పష్టం చేశారు. ఓ ఐదేళ్ల బాలుడు.. పీఠాధిపతి అవ్వటం చరిత్రలో ఇదే మొదటిసారని చెబుతున్నారు.
ఇదీ చదవండి : ఆయన ఆర్మీ మేజర్, ఆమె సిటీ మెజిస్ట్రేట్.. రూ.500 ఖర్చుతో పెళ్లి