బిహార్‌లోని పట్నా జిల్లాలో విషాదం నెలకొంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ముఠాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో మాటామాటా పెరిగి ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. తొమ్మిది మంది గాయపడ్డారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. జిల్లాలోని బిహ్తా పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోన్ నది తీరంలోని ఇసుకను కొందరు ముఠాలుగా ఏర్పడి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అయితే గురువారం తెల్లవారుజామున రెండు గ్రూపుల మధ్య ఇసుక రవాణా విషయంలో చిన్న వివాదం తలెత్తింది. అనంతరం మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఇరు వర్గాలు కాల్పులు జరుపుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు.

ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు.. సోన్ నది వద్దకు చేరుకున్నారు. మృతులను మానేర్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన శతృఘ్న, హరేంద్ర, లాల్‌దేవ్, విమలేశ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాల కోసం సోన్ నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇవీ చదవండి: 'అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు'.. గహ్లోత్ ప్రకటన.. సోనియాకు క్షమాపణ