కేరళ.. మలబార్ ఎక్స్ప్రెస్లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. రైలులోని సరకుల పెట్టె(పార్సిల్ కోచ్)లో మంటలు అంటుకున్నాయి. తిరువనంతపురం జిల్లా వర్కాలాలోని ఎడవా స్టేషన్లో ఈ ఘటన జరిగింది.
అగ్ని ప్రమాదాన్ని పసిగట్టిన ఓ ప్రయాణికుడు చైన్ లాగి, రైలును ఆపాడు. అయితే.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.