ETV Bharat / bharat

ఎక్స్​ప్రెస్​ రైలులో మంటలు.. 'బీడీ'నే కారణం! - Betul Fire at Secunderabad Danapur Express train

Fire accident in train: సికింద్రాబాద్​- దానాపుర్​ ఎక్స్​ప్రెస్​ రైలులోని జనరల్​ బోగీల్లో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని బేతుల్​ వద్ద జరిగింది.

Fire accident in train
మంటలను ఆర్పుతున్న సిబ్బంది
author img

By

Published : Feb 23, 2022, 6:28 PM IST

Fire accident in train: సికింద్రాబాద్-దానాపుర్ ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ బోగీల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించగా ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. బోగీలో పొగలు రావడం గమనించిన కొందరు ప్రయాణికులు సిబ్బందిని అప్రమత్తంగా చేసినట్లు పేర్కొన్నారు. రైలును వెంటనే నిలిపివేసినట్లు చెప్పారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని బేతుల్​ వద్ద జరిగింది.

Fire accident in train
బోగీల నుంచి పొగలు
Fire accident in train
బోగీల్లో పొగలు రావడం వల్ల కిందకు దిగిన ప్రయాణీకులు
Fire accident in train
మంటలార్పిన సిబ్బంది

స్టేషన్​ కంటే ముందుగానే రైలును నిలిపివేయడం వల్ల ప్రయాణికులు ఆందోళనకు గురైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిందని తెలుసుకొని కొందరు బేతుల్ రైల్వే స్టేషన్​కు సమీపంలో ఉండే అండర్ బ్రిడ్జి వద్ద దిగినట్లు వివరించారు. అనంతరం రైలును బేతుల్ స్టేషన్‌కు తీసుకెళ్లగా.. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పినట్లు పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. ప్రయాణికుల్లో ఓ వ్యక్తి బీడీ కాల్చి ఎలక్ట్రిక్​ బాక్స్​లో వేసినట్లు అనుమానిస్తున్నారు. దీంతో షార్ట్​ సర్కూట్​ అయ్యి ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

Fire accident in train
మంటలు చెలరేగడం వల్ల నిలిచిపోయిన రైలు
Fire accident in train
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్న అధికారులు

ఇదీ చూడండి: కచోడీ కోసం ట్రైన్​ ఆపిన డ్రైవర్.. తర్వాత ఏమైందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.