ETV Bharat / bharat

వైరల్ వీడియో: ట్రాఫిక్​ పోలీస్​తో యువకుడి ఫైట్ - ayodhya traffic police fight video

అయోధ్యలో ట్రాఫిక్​ పోలీస్​తో ఓ యువకుడు గొడవపడ్డాడు. పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఫైటింగ్​కు దారితీసింది. మొదట ట్రాఫిక్​ పోలీసే యువకుడిపై చేయిచేసుకున్నాడు. ఆ తర్వాత యువకుడు ప్రతిఘటించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అధికారులు ఈ విషయాన్ని తీవ్రం​గా పరిగణించి విచారణ చేపట్టారు.

fight between traffic police and a youth, video goes viral
వైరల్ వీడియో: ట్రాఫిక్​ పోలీస్​తో యువకుడి ఫైట్
author img

By

Published : Mar 16, 2021, 6:53 PM IST

అయోధ్యలో నిత్యం రద్దీగా ఉండే హనుమాన్​ గఢీ చౌరస్తా వద్ద ట్రాఫిక్​ పోలీస్​కు, యువకుడికి మధ్య గొడవ జరిగింది. పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం ఇద్దరి మధ్య ఫైట్​కు దారితీసింది. తొలుత తనను ప్రశ్నించిన యువకుడిపై ట్రాఫిక్​ పోలీస్ దాడి చేశాడు. అనంతరం కోపోద్రిక్తుడైన యువకుడు ప్రతిదాడికి దిగాడు. ఇద్దరి మధ్య గొడవను అక్కడి పోలీసులు నియంత్రించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఘటనను తీవ్రం​గా పరిగణించిన అధికారులు విచారణ చేపట్టారు.

వైరల్ వీడియో: ట్రాఫిక్​ పోలీస్​తో యువకుడి ఫైట్

పార్కింగ్​ సమస్య..

హనుమాన్​గఢీ చౌరస్తా నిత్యం రద్ధీగా ఉంటుంది. ఇక్కడి మిఠాయి దుకాణాల యజమానులు వారి వాహనాలను రోడ్డుపైనే పార్క్ చేస్తారు. ఇది అక్రమమైనా ట్రాఫిక్​ పోలీసులతో వారికున్న చెలిమి కారణంగా ఎలాంటి చర్యలు ఉండవు. హనుమాన్ దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. మంగళవారం రద్దీ విపరీతంగా ఉంటుంది.

ట్రాఫిక్​ పోలీసులు మాత్రం మిఠాయి దుకాణ యజమానులను ఏమీ అనకుండా ఇతర వాహనదారులతో దురుసుగా ప్రవర్తిస్తారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి: 'దేశద్రోహం'పై లోక్​సభలో మాటల యుద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.