ETV Bharat / bharat

'సంతాన సాఫల్య కేంద్రాలు లాభార్జన పరిశ్రమలు కాదు' - ఐవీఎఫ్​ సెంటర్లు

ప్రభుత్వం తీసుకొచ్చిన అసిస్టెడ్​ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లుపై వైద్య-ఆరోగ్యశాఖ పార్లమెంటరీ స్థాయిూ సంఘం అధ్యయనం చేసింది. సంతాన సాఫల్యతకు సాయం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని కొందరు లాభార్జన పరిశ్రమగా చూడడాన్ని తప్పుపట్టింది. ఇది చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేసింది.

Fertility centers are not for-profit industries say parliamentary standing committee
'సంతాన సాఫల్య కేంద్రాలు లాభార్జన పరిశ్రమలు కాదు'
author img

By

Published : Mar 20, 2021, 8:49 AM IST

సంతాన సాఫల్యతకు సాయం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని డబ్బులు కురిపించే పరిశ్రమగా చూడొద్దని వైద్య-ఆరోగ్యశాఖ పార్లమెంటరీ స్థాయిూ సంఘం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన అసిస్టెడ్​ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లుపై ఈ సంఘం అధ్యయనం చేసింది. అందులో సంతాన సాఫల్యతను లాభదాయక పరిశ్రమగా పరిగణించడాన్ని తప్పుబట్టింది. దీని ద్వారా బిలియన్​ డాలర్లు ఆర్జించవచ్చని, వ్యాపార వృద్ధికి దండిగా అవకాశాలు ఉంటాయని పేర్కొనడాన్నీ తప్పుబట్టింది. ఇది చాలా బాధాకరమైన విషయమని వ్యాఖ్యానించింది. పేదల భాదలను, ధనవంతుల అవకాశాలను వ్యాపార వస్తువుగా మలుచుకునే ధోరణితో రూపొందించిన ఈ బిల్లు పరోపకార స్ఫూర్తిని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు వారికే వదిలేయకుండా ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రిల్లో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. అప్పుడే పేదలకు ఇలాంటి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడింది. ఐవీఎఫ్​ సెంటర్లను వ్యాపార కేంద్రాలుగా నిర్వహించే విధానాన్ని ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించింది. చికిత్సల ధరల విషయమై నిర్ణీత విధానాలను రూపొందించాలని సిఫార్సు చేసింది. డిప్లొమా హోల్డర్లు, ఎండీలు ఐవీఎఫ్​ కేంద్రాలను ఏర్పాటు చేయకుండా చూడాలని, ఇందుకోసం ఏడాది, రెండేళ్లు కాలపరిమితితో ప్రత్యేక ఏఅర్​టీ కోర్సులు ప్రవేశపెట్టాలని పేర్కొంది. మగవారి లైంగిక సామర్థ్యాలు, వారి సంతాన సాఫల్య సమర్థతను పరీక్షించేందుకు వీలుగా ఏఆర్​టీ క్లినిక్​ల్లో ఆండ్రాలజిస్ట్​, యూరాలజిస్ట్​లు ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

ఇదీ చూడండి: భారత్​లో 4 కోట్ల మైలురాయి దాటిన వ్యాక్సినేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.