ETV Bharat / bharat

'కరోనా సమయంలో నా భార్యకు ముద్దు కూడా పెట్టలేదు' - ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు

జమ్మూలో జరిగిన ఓ పుస్తక కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్​ అబ్దుల్లా.. తన ప్రసంగంతో సభలో నవ్వులు పూయించారు. మహమ్మారి భయంతో తన భార్యకు ముద్దు కూడా పెట్టలేదని అన్నారు. కొవిడ్-19వల్ల తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. వ్యాక్సిన్ రావటంపై హర్షం వ్యక్తం చేశారు.

Farooq Abdullah says 'can't even kiss my wife' because of pandemic , leaves audience in splits
'కరోనా సమయంలో నా భార్యకు ముద్దు కూడా పెట్టలేదు'
author img

By

Published : Jan 18, 2021, 7:47 AM IST

కరోనా సమయంలో తన భార్యకు ముద్దు కూడా పెట్టలేదని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్​ అబ్దుల్లా అన్నారు. ఓ పుస్తక కార్యక్రమంలో పాల్గొనేందుకు జమ్మూ వచ్చిన అబ్దుల్లా.. తన 35 నిమిషాల ప్రసంగంలో నవ్వులు పూయించారు. కరోనా.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని అన్నారు. తానూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని వివరించారు.

"ఎదుటి వ్యక్తితో చేతులు కలపడానికి భయమేస్తోంది. నిజాయతీగా చెబుతున్నా నేనైతే నా భార్యకు ముద్దు కూడా పెట్టలేదు. ఏమో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఇక కౌగిలింత ప్రసక్తే లేదు. మనసెంత కోరుకున్నా సరే"

-- ఫరూక్​ అబ్దుల్లా

కొవిడ్​-19 టీకాలు వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేసిన అబ్దుల్లా.. త్వరలోనే ఈ మహమ్మారి పీడ విరగడవ్వాలని అందరూ దేవుడిని ప్రార్థించాలని కోరారు.

ఇదీ చదవండి : నేటి నుంచి బంగాల్​, అసోంలో సీఈసీ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.