నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు ప్రతినిధిగా ఏర్పడిన సంయుక్త కిసాన్ మోర్చా కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ మోర్చాలో భాగస్వామ్య రైతు సంఘం అయిన భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత గుర్నామ్ సింగ్ చదౌనీని తమ కూటమి నుంచి తొలగించింది.
రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో సంయుక్త కిసాన్ మోర్చా ఈ నిర్ణయం తీసుకుంది. గుర్నామ్ సింగ్ ఇటీవల కొందరు ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసినట్లు తెలిపింది. ప్రభుత్వంతో నిర్వహించే చర్చల్లో ఇకపై ఆయన పాల్గొనరని స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యులున్న ఈ కమిటీలో గుర్నామ్ సింగ్‌పై వేటుతో ప్రస్తుతం ఖాళీ ఏర్పడింది.