రైతు సంఘాల ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘూ, టిక్రీలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు బారికేడ్లను దాటుకుని నగరంలోకి ప్రవేశించడానికి యత్నించారు.
ట్రాక్టర్ ర్యాలీ నిర్వహణపై భద్రత సిబ్బంది రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రాజపథ్లో కవాతు ముగియగానే నిరసన నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు. కానీ కొందరు రైతులు అవేం పట్టించుకోకుండా బారికేడ్లు దాటుకుని ఔటర్ రింగ్ రోడ్డు వైపుగా వెళ్లసాగారు.
-అధికారులు
ఈ ఘటనపై సంయుక్త్ కిసాన్ మోర్చా స్పందించింది. బారికేడ్లు దాటేందుకు యత్నించిన వారు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీకి చెందిన వారని పేర్కొంది. తమ రైతు సంఘం ర్యాలీ పోలీసులు అనుమతించాకే ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.
గణతంత్ర దినోత్సవం రోజు ఔటర్ రింగ్ రోడ్డులో కవాతు నిర్వహిస్తామని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ సోమవారం స్పష్టంచేసింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు వద్ద నిరసన తెలుపుతామని రైతు సంఘాలు ప్రకటించాయి.
ఇదీ చూడండి : గణతంత్ర కవాతుకు సిద్ధమైన రైతులు