నూతన వ్యవసాయ చట్టాలపై మరో దఫా చర్చలకు రావాలని కేంద్రం రాసిన లేఖపై బుధవారం(డిసెంబర్23) నిర్ణయం తీసుకుంటామని రైతు నాయకుడు కుల్వంత్ సింగ్ సంధు తెలిపారు. తదుపరి కార్యాచరణపై పంజాబ్‌కు చెందిన 32 రైతు సంఘాలతో సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. అయితే కొత్త వ్యవసాయ చట్టాల రద్దే తాము కోరుతున్నట్లు ఆయన మరో మారు స్పష్టం చేశారు.
ప్రధాని రావొద్దు
జనవరి26 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్‌కు రాకుండా చూడాలని ఆ దేశ ఎంపీలకు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: ఎగుమతులపై రైతు నిరసనల ప్రభావమెంత?