తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఓ చిరుత పులిని చంపేశారు ఇద్దరు రైతులు. ఈ ఘటన కర్ణాటకలోని హవేరి జిల్లా బులపురలో జరిగింది.
గాయాలతో బయటపడి...
గాడిగెప్ప, క్రిష్ణప్ప అనే ఇద్దరు రైతులు బుధవారం ఉదయం 3 గంటలకు పొలానికి వెళ్లగా ఓ చిరుత పులి వారిపై దాడి చేసింది. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు చిరుతపై తిరిగి దాడి చేశారు. ఓ బండ రాయితో ఆ వన్యమృగాన్ని కొట్టారు. కాసేపటి తర్వాత ఆ చిరుత అక్కడే కన్నుమూసింది.
ఈ ఘటనలో గాడిగెప్పకు తీవ్రంగా గాయాలయ్యాయని, ఆయనను చిత్రదుర్గ ఆసుపత్రిలో చేర్పించామని స్థానికులు తెలిపారు. క్రిష్ణగప్పకు స్వల్పగాయాలైనట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:200 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం