ETV Bharat / bharat

కుమారుడి ప్రేమ వివాహం- కుటుంబం గ్రామ బహిష్కరణ - బార్మర్

ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే కారణంతో యువకుడి కుటుంబాన్ని కుల పెద్దలు గ్రామబహిష్కరణ చేశారు. ఈ ఘటన రాజస్థాన్​లోని బాడ్మేర్​ జిల్లాలో జరిగింది.

Family ostracised over son' love marriage in Rajasthan
కుమారుడి ప్రేమ వివాహం- కుటుంబం గ్రామ బహిష్కరణ
author img

By

Published : Mar 24, 2021, 1:57 PM IST

ప్రేమ వివాహం చేసుకున్నందుకు యువకుడి కుటుంబాన్ని గ్రామబహిష్కరణ చేశారు కులపెద్దలు. ఈ ఘటన రాజస్థాన్​లోని బాడ్మేర్​​ జిల్లా బుక్యా భగత్​ సింగ్​ గ్రామంలో జరిగింది.

అంతేకాకుండా తమకు రూ.5లక్షల జరిమానా కూడా వేశారని బాధిత కుటుంబం తెలిపింది. రోడ్డు సదుపాయన్ని, తాగునీటిని పొందడాన్ని లేకుండా చేశారని వాపోయారు. దుకాణదారులు కూడా తమకు సరకులు అమ్మడం లేదని తెలిపారు.

జనవరి 5న నాలుగు గ్రామాల పెద్దలు, ఏడెనిమిది మంది కులపెద్దలు వచ్చి తమను డబ్బు చెల్లించాల్సిందిగా డిమాండ్​ చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. డబ్బు కట్టలేదని అప్పటి నుంచి తమను గ్రామ బహిష్కరణ చేశారని తెలిపింది.

దీనిపై బాధిత కుటుంబ సభ్యులు డివిజనల్​ కమిషనర్​ డాక్టర్​ రాజేశ్​ శర్మకు, జిల్లాకలెక్టర్​, అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తమను బహిష్కరించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

ఇదీ చదవండి: మూడేళ్లుగా అత్యాచార కేసు లేని ఆదర్శ జిల్లా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.