ETV Bharat / bharat

చేతిలో చిన్నారి మృతదేహం, గుండెల నిండా దుఃఖం, అంబులెన్స్​ లేక కాలినడకన - బాగపత్​లో చిన్నారి మృతి

అభం శుభం తెలియని ఆ రెండేళ్ల చిన్నారి ఏడ్చిందని సవతి తల్లి రోడ్డు మీదకు విసిరేసింది. అదే సమయంలో అటు నుంచి వస్తున్న కారు ఢీకొని అక్కడిక్కడే మృతి చెందింది. అయితే పోస్టుమార్టం పూర్తయ్యాక చిన్నారి మృతదేహాన్ని తీసుకుళ్లేందుకు అంబులెన్స్​ లేక ఆమె తండ్రి చేతిలో పట్టుకుని బరువైన హృదయంతో ఇంటికి చేరుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన యూపీలో జరిగింది.

child dead body
శవాన్ని మోస్తున్న తండ్రి
author img

By

Published : Aug 28, 2022, 1:36 PM IST

Updated : Aug 28, 2022, 1:45 PM IST

చిన్నారి మృతదేహాన్ని చేతిలో పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ తండ్రిని చూసి.. యూపీలోని బాగ్​పత్​ ప్రాంత ప్రజలందరూ చలించిపోయారు. తన రెండో భార్య చేసిన నిర్వాకంతో కుమార్తె కోల్పోయిన ఆ తండ్రి బాధను, మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్​ లేక పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని అయ్యో అనుకున్నారు. అసలేం జరిగందంటే.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్‌పత్‌లోని యమునోత్రి హైవేపై శుక్రవారం.. రెండేళ్ల చిన్నారి ఏడ్చిందన్న కోపంతో ఆమె సవతి తల్లి రోడ్డుపై పడేసింది. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టగా చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శనివారం కేసు విచారణ పూర్తయిన తరువాత చిన్నారి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

చేతిలో చిన్నారి మృతదేహం, గుండెల నిండా దుఃఖం, అంబులెన్స్​ లేక కాలినడకన

అయితే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆసుపత్రి సిబ్బంది వాహనం ఏర్పాటు చేయలేదు. అది తెలిసిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు రూ.500 ఇచ్చినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. వాహనం లేక పోవడం వల్ల కుటుంబ సభ్యులు చిన్నారి మృతదేహాన్ని చేతిలో పట్టుకుని నడిచకుంటూ వెళ్లారు. అయితే వారు కొంత దూరం నడుచుకుంటూ వెళ్లాక ఆసుపత్రికు చెందిన వాహనం అందుబాటులోనికి వచ్చిందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం చిన్నారి మృతదేహాన్ని చేతిలో తీసుకెళ్తున్న వీడియో వైరల్​గా మారింది.

ఇవీ చదవండి: లారీ ఢీకొని ఐదుగురు దుర్మరణం, కారు బోల్తా పడి మరో ఐదుగురు

అందరి కళ్లూ నోయిడా జంట భవనాలపైనే, ఏం జరుగుతుందో

Last Updated : Aug 28, 2022, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.