Fake tablets company seal: కరోనా విజృంభిస్తున్న తరుణంలో విటమిన్ డీ మాత్రలకు గిరాకీ పెరిగింది. దీన్ని ఆసరా చేసుకున్న కొందరు నకిలీ మందులను తయారు చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ ఫార్మసీ కంపెనీలో నకిలీ విటమిన్ డీ మాత్రలు భారీగా లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ఆ ఫార్మా సంస్థను సీజ్ చేసింది దిల్లీ డ్రగ్స్ కంట్రోల్ విభాగం.
మక్లైడ్స్ ఫార్మాసుటికల్స్ సంస్థ పేరుతో నకిలీ మందులు విక్రయిస్తున్నారని.. ఆ సంస్థ నుంచి ఫిర్యాదు అందిన క్రమంలో తనిఖీలు చేసినట్లు అధికారులు తెలిపారు. డిసెంబరు చివరి వారంలో దిల్లీలో విక్రయిస్తుండగా కొందరు పట్టుబడ్డారని చెప్పారు. అవి ఆగ్రా నుంచి వస్తున్నట్లు గుర్తించి.. స్థానిక అధికారులతో కలిసి మాధవ్ ఫార్మాలో జనవరి 19న తనిఖీ చేసి నమూనాలను సేకరించామన్నారు. నమూనాలను పరీక్షించగా నకిలీ మందులుగా తేలినట్లు అధికారులు వెల్లడించారు. మాధవ్ ఫార్మాను సీజ్ చేసినట్లు తెలిపారు.
అయితే.. ఈ మాత్రలు ఎక్కడ తయారు చేస్తున్నారని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: