Faculty Jobs 2023 : ఉన్నత విద్యను అభ్యసించి.. అధ్యాపక వృత్తి చేపట్టేందుకు ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (NSUT) 322 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. (NSUT Faculty Recruitment 2023) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ హార్డ్‌కాపీని మాత్రం యూనివర్సిటీకి పంపించాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
NSUT Faculty Vacancy :
- ప్రొఫెసర్ - 29 పోస్టులు
- అసోసియేట్ ప్రొఫెసర్ - 81 పోస్టులు
- అసిస్టెంట్ ప్రొఫెసర్ - 212 పోస్టులు
ఉద్యోగాలు - డిపార్ట్మెంట్స్
Engineering Jobs : కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజినీరింగ్, ఐసీఈ, ఈఈ, ఎంఈ, బీఎస్ఈ, బీటీ, సీఈ/ జీఐ, అగ్రికల్చర్, డిజైన్, మేనేజ్మెంట్ స్టడీస్, ఐఈవీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, సైకాలజీ (NSUT Recruitment 2023).
విద్యార్హతలు
NSUT Faculty Eligibility : ఈ ప్రొఫెసర్ ఉద్యోగాలకు.. అభ్యర్థులు బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్/ ఎమ్మెస్సీ చేసి ఉండాలి. అలాగే పీహెచ్డీ చేసి ఉండాలి. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) లేదా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET) లేదా SLET క్వాలిఫై అయ్యుండాలి. (NSUT Professor Jobs 2023)
వయోపరిమితి
NSUT Faculty Age Limit :
పోస్ట్ | గరిష్ఠ వయోపరిమితి |
ప్రొఫెసర్ | 55 సంవత్సరాలు |
అసోసియేట్ ప్రొఫెసర్ | 50 సంవత్సరాలు |
అసిస్టెంట్ ప్రొఫెసర్ | 35 సంవత్సరాలు |
నోట్ : ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు
NSUT Faculty Application Fee : అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1000, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.1000 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
పే స్కేల్
NSUT Faculty Pay Scale :
ప్రొఫెసర్ (లెవల్ -14) | రూ.1,44,200 - రూ.2,18,200 |
అసోసియేట్ ప్రొఫెసర్ (లెవల్-13 ఏ1) | రూ.1,31,400 - రూ.2,17,100 |
అసిస్టెంట్ ప్రొఫెసర్ (లెవల్-10) | రూ.57,700 - రూ.1,82,400 |
దరఖాస్తు విధానం
NSUT Faculty Application Process : అభ్యర్థులు www.nsut.ac.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. తరువాత (సెల్ఫ్ అటాస్టెడ్ సర్టిఫికేట్లను) హార్డ్‌కాపీలను 2023 ఆగస్టు 31లోపు యూనివర్సిటీకి పంపించాలి.
ముఖ్యమైన తేదీలు
NSUT Faculty Recruitment Important Dates :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 జులై 18
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 17
- అప్లికేషన్ హార్డ్ కాపీని 2023 ఆగస్టు 31లోపు యూనివర్సిటీకి పంపించాల్సి ఉంటుంది.