ETV Bharat / bharat

ఆర్మీ మాజీ అధికారి దంపతుల్ని సజీవ దహనం చేసిన దుండగులు

Ex-Army man burnt to death: రిటైర్డ్​ ఆర్మీ అధికారి, ఆయన భార్యకు కొందరు నిప్పంటించి చంపిన ఘటన పంజాబ్​లో కలకలం సృష్టించింది. ఇంట్లోకి చొరబడిన దుండగులు.. తన కాళ్లు, చేతులు కట్టేసి తన అత్తమామలకు నిప్పంటించారని కోడలు పోలీసులకు చెప్పింది.

Ex-Army man burnt to death
మాజీ ఆర్మీ అధికారి దంపతులకు నిప్పంటించి..
author img

By

Published : Jan 2, 2022, 7:12 PM IST

Ex-Army man burnt to death: పంజాబ్​ హోషియార్​పుర్​లోని తాండాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్​ ఆర్మీ అధికారి మంజీత్​ సింగ్​, ఆయన భార్యకు కొందరు దుండగులు నిప్పంటించి చంపేశారు. వారి ఇంట్లోనే జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Ex-Army man burnt to death
సతీమణితో మంజీత్​ సింగ్​

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లారు. కాలిపోయిన మృతదేహాలను పోస్ట్​మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మంజీత్​ సింగ్​ కుమారుడు రవీందర్​ సింగ్.. ఘటనపై​ అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణ చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న మంజిత్​ సింగ్​ కోడలిని ప్రశ్నించారు.

"కొందరు మా ఇంట్లోకి చొరబడ్డారు. నన్ను మత్తుపదార్థాలు పీల్చేలా చేశారు. ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయాను. నా కాళ్లు, చేతులు కట్టేసి ఓ గదిలో పడేశారు. ఆ తర్వాత వారికి నిప్పంటించారు," అని ఆమె పోలీసులకు వివరించింది.

Ex-Army man burnt to death
ఘటన తర్వాత మంజీత్​ ఇల్లు

ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోందని, నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు చెప్పారు.

ఇదీ చూడండి:- కుక్క పేరు తెచ్చిన తంట.. మహిళ ఒంటికి నిప్పంటించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.