తాలిబన్ల(Taliban) వశమైన అఫ్గానిస్థాన్(Afghanistan news) రాజధాని కాబుల్‌లో.. రోజురోజుకీ భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 300 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు(Indian evacuation from Afghanistan) అధికారులు ఏర్పాట్లు చేశారు. భారత వైమానిక దళానికి చెందిన మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 87 మంది భారతీయులను ఇవాళ దిల్లీకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. అయితే.. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ ఇండియాకు బయలుదేరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు.
"అఫ్గాన్ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకువస్తున్నాం. ఏఐ 1956 విమానం 87 మంది భారతీయులతో తజకిస్థాన్ నుంచి బయలుదేరింది. ఇందులో ఇద్దరు నేపాలీలు కూడా ఉన్నారు. మరింత మందిని భారత్‌కు సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం."
--అరిందమ్ బాగ్చి, విదేశాంగ అధికార ప్రతినిధి.
మరోవైపు కాబుల్ నుంచి దోహాకు తరలించిన 135 మంది భారతీయులను.. స్వదేశానికి తీసుకువస్తున్నట్లు కతార్‌లోని భారత దౌత్యకార్యాలయం ప్రకటన చేయడం గమనార్హం. యూఎస్, నాటో దళాల సాయంతో వీరిని దోహాకు తరలించినట్లు భారత అధికారులు పేర్కొన్నారు.
అప్గాన్ రాజధాని నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకురావడంపై దృష్టి సారించామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అప్గానిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల సంఖ్య.. 400 వరకూ ఉండొచ్చని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో పాటు ఇతర దేశాల సమన్వయంతో వారిని స్వదేశానికి తీసుకురావడానికి భారత్ మార్గాలను అన్వేషిస్తోంది.
-
#WATCH | Evacuated Indians from Kabul, Afghanistan in a flight chant 'Bharat Mata Ki Jai' on board
— ANI (@ANI) August 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
"Jubilant evacuees on their journey home,"tweets MEA Spox
Flight carrying 87 Indians & 2 Nepalese nationals departed for Delhi from Tajikistan after they were evacuated from Kabul pic.twitter.com/C3odcCau5D
">#WATCH | Evacuated Indians from Kabul, Afghanistan in a flight chant 'Bharat Mata Ki Jai' on board
— ANI (@ANI) August 21, 2021
"Jubilant evacuees on their journey home,"tweets MEA Spox
Flight carrying 87 Indians & 2 Nepalese nationals departed for Delhi from Tajikistan after they were evacuated from Kabul pic.twitter.com/C3odcCau5D#WATCH | Evacuated Indians from Kabul, Afghanistan in a flight chant 'Bharat Mata Ki Jai' on board
— ANI (@ANI) August 21, 2021
"Jubilant evacuees on their journey home,"tweets MEA Spox
Flight carrying 87 Indians & 2 Nepalese nationals departed for Delhi from Tajikistan after they were evacuated from Kabul pic.twitter.com/C3odcCau5D
నినాదాల హోరు..
తజకిస్థాన్ నుంచి భారత్‌కు బయలుదేరిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో 'భారత్ మతాకీ జై' అంటూ నినాదాలు చేశారు స్వదేశీ పౌరులు. ఈ వీడియోను విదేశాంగ శాఖ షేర్ చేసింది.
ఇదీ చదవండి:Afghan news: తాలిబన్లు కిడ్నాప్ చేసిన భారతీయులు సేఫ్!