ETV Bharat / bharat

భారత్​లో 68 మిలియన్​ టన్నుల ఆహారం వృథా - భారత్​లో ఆహార వ్యర్థాలు

2019 ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 931 మిలియన్​ టన్నుల ఆహారోత్పత్తులు వ్యర్థమయ్యాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్​డీపీ)​ పేర్కొంది. భారత్​లో 68.7 మిలియన్​ టన్నులు ఆహారం వ్యర్థమైందని వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, తన భాగస్వామి సంస్థ డబ్ల్యూఆర్​ఏపీ సహకారంతో ఆహార వ్యర్థ సూచీ- 2021ని తయారుచేసింది.

Estimated 931 mn tonnes of food wasted globally in 2019; India's share 68 mn: UN report
భారత్​లో ఆహార వ్యర్థాలు '68 మిలియన్​ టన్నులు'
author img

By

Published : Mar 5, 2021, 3:32 PM IST

Updated : Mar 5, 2021, 4:41 PM IST

ప్రపంచవ్యాప్తంగా 2019లో 931 మిలియన్​ టన్నుల ఆహారం వృథా అయిందని యునైటెడ్​ నేషన్స్​ ఎన్విరాన్​మెంట్​ ప్రోగ్రామ్ (యూఎన్​డీపీ)​ వెల్లడించింది. భారత్​లో 68.7 మిలియన్​ టన్నులు ఆహారం వ్యర్థమైనట్లు పేర్కొంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, తన భాగస్వామి సంస్థ డబ్ల్యూఆర్​ఏపీ సహకారంతో ఈమేరకు ఆహార వ్యర్థ సూచీ- 2021ని తయారుచేసింది.

మొత్తం ఆహారోత్పత్తిలో 17 శాతం..

మొత్తం ఆహార వ్యర్థాలలో 61 శాతం వ్యర్థాలు గృహాల నుంచి కాగా..26 శాతం ఆహార సేవల నుంచి, 13 శాతం రిటైల్​ రంగంలో వెలుగుచూసినట్లు యూఎన్​డీపీ తన నివేదకలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆహార ఉత్పత్తిలో 17 శాతం వ్యర్థమవుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ మొత్తం పూర్తిగా నింపిన 23 మిలియన్​ల '40 టన్నుల ట్రక్కు'లకు సమానమని తెలిపింది. ఈ వ్యర్థాలతో భూమిని ఏడు సార్లు చుట్టిరాగలమని అభిప్రాయపడింది. ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి దేశం గణనీయమైన స్థాయిలో ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు తెలిపింది.

ఇళ్లలోనే ఎక్కువ..

ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి 121 కేజీల ఆహారం వ్యర్థం చేస్తున్నట్లు యూఎన్​డీపీ లెక్కగట్టింది. అందులో ఇళ్లలోనే 74 కేజీలు వృథా చేస్తున్నట్లు పేర్కొంది. మొత్తం ఆహార వ్యర్థాలలో 11 శాతం వినియోగదారుని వద్ద వ్యర్థమవుతుండగా.. 5 శాతం ఆహార సేవలలో, మరో 2 శాతం రిటైల్​ విభాగంలో వ్యర్థాలు నమోదయ్యాయని తెలిపింది.

ఆహార వ్యర్థాలను తగ్గించేందుకు వ్యాపారాలు, ప్రభుత్వాలు, పౌరులు నడుం బిగించాలి. వాతావరణ మార్పులు, సామాజిక, ఆర్థికపరమైన సమస్యల్లో ఆహార వ్యర్థాల పాత్ర గణనీయంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్​హౌస్​ ఉద్గారాల్లో 8-10శాతం ఆహార వ్యర్థాల నుంచే వస్తుంది.

-ఇంగెర్ అండర్సన్, యూఎన్​డీపీ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​

ఆకలి పెరుగుతున్నా..

ప్రపంచవ్యాప్తంగా 2019లో ఓవైపు 690 మిలియన్​ ప్రజలు ఆకలితో బాధపడ్డా.. ఆహార వ్యర్థాలు గణనీయంగా నమోదయ్యాయని నివేదిక తెలిపింది. కొవిడ్​ తర్వాత ఆకలితో బాధపడే వారి సంఖ్య పెరిగి ఉంటుందని అంచనా వేసింది. ఆహార వ్యర్థాలను తగ్గించాల్సిన తక్షణ అవసరాన్ని యూఎన్​డీపీ నొక్కిచెప్పింది. కొవిడ్​ పరిస్థితుల నుంచి కోలుకోవడానికి ఆహార వ్యర్థాలను తగ్గించడాన్ని ఓ వ్యుహాంగా పేర్కొంది.

ఇదీ చదవండి:'తయారీ రంగానికి ఊతమిస్తేనే ఉపాధి'

Last Updated : Mar 5, 2021, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.