ETV Bharat / bharat

అసలు వయసు 41.. ఆధార్​లో 123.. అధికారుల నిర్లక్ష్యంతో పథకాలన్నీ కట్​ - తమిళనాడు మహిళ వింత సమస్య

123 ఏళ్ల ఓ మహిళ ప్రస్తుతం ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతుంది. అదేంటి అంత వయస్సులోనూ ఆమె ఎందుకలా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది అనుకుంటున్నారా..? అయితే అది ఆమె తప్పిదం కాదండీ..! ఆధార్​ తెచ్చిన తంట. ఈ ఆధార్​ సమస్యతో ప్రభుత్వం ప్రకటించిన అన్ని పథకాలకీ ఆమె అనర్హురాలిగా మారింది. నిజానికి ఆమె వయస్సు ఏంతో తెలుసుకుందామా..!

errors in aadhar card
errors in aadhar card
author img

By

Published : Feb 28, 2023, 8:59 AM IST

Updated : Feb 28, 2023, 12:03 PM IST

తమిళనాడు చెందిన ఓ మహిళకు వింత సమస్య ఎదురైంది. ఆమె వయస్సు 41 సంవత్సరాలు.. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆధార్ కార్డ్​లో ఆమె వయసు 123 ఏళ్లుగా పడింది. దీంతో ఆమె ఏ ప్రభుత్వ పథకానికీ అర్హత పొందలేకపోతుంది. గత కొన్నేళ్లుగా తన ఆధార్​ కార్డులో పుట్టిన సంవత్సరాన్ని మార్చేందుకు ప్రయత్నించి విఫలమైంది మహిళ. చివరికి చేసేదేమీ లేక బాధిత మహిళ.. తన సమస్యను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో పిటిషన్​ దాఖలు చేసింది.

తిరుచ్చి జిల్లాలోని దయానుర్​ ప్రాంతానికి చెందిన కవిత అనే మహిళ 1982లో జన్మించింది. అయితే కవిత ఆధార్​లో మాత్రం 1900లో జన్మించినట్లు ఉంది. ప్రస్తుతం కవిత వయస్సు 41 సంవత్సరాలు కాగా.. ఆధార్​ ప్రకారం 123 ఏళ్లు. ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పథకానికి ఆధార్​తో అనుసంధానం చేస్తున్నాయి. అయితే కవిత ఏదైనా పథకానికి అప్లై చేసుకున్నప్పుడు అధికారులు ఈ తప్పిదాన్ని గుర్తించి.. ఆధార్​లో ఆమె వయసును సరిచేసుకుని రావాలని కోరేవారు. ఆధార్​లో తలెత్తిన ఈ చిన్న తప్పిదం కారణంగా ఆమెకు అన్ని అర్హతలు ఉన్నా సరే.. ప్రభుత్వ పథకాలకు అనర్హురాలుగా మారింది.

కవిత గత కొన్నేళ్లుగా తన ఆధార్​లో పుట్టిన సంవత్సరాన్ని మార్చేందుకు అనేక ఆధార్​ కేంద్రాలకు వెళ్లింది. అక్కడ అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆధార్​లో వయస్సను మార్చాలంటే.. బర్త్​ సర్టిఫికేట్​, ఎడ్యుకేషన్​ సర్టిఫికేట్స్​​ అవసరం అని చెప్పారు. ఈ పత్రాలులేవి తన వద్ద లేనందున.. కవిత ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఓటరు గుర్తింపు కార్డు మాత్రమే తనకు ఉన్న ఏకైక ఆధారమని కవిత వారివద్ద వాపోయింది. అయినా సరే ఓటర్​ ఐడీనీ ఆధారంగా చేసుకుని పుట్టిన సంవత్సరాన్ని మార్చలేమని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఇన్నాళ్లుగా ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందలేదని ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యతో తాను తీవ్రంగా నష్టపోయానని ఆమె తెలిపింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె తన సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలంటూ కలెక్టర్​ కార్యాలయంలో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది.

ఆధార్, రేషన్​ కార్డుల్లో తలెత్తిన ఇలాంటి చిన్న చిన్న లోపాలు కారణంగా గత కొన్నేళ్లుగా అక్కడక్కడా కొందరికి ఇటువంటి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే బంగాల్​లో వెలుగుచూసింది. రేషన్​ కార్డులో వివరాలు పొందుపరిచే సమయంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ కూర్రాడు తన తండ్రి కంటే వయస్సులో పెద్దవాడు అయ్యాడు. వాస్తవానికి అతని 14 సంవత్సరాలు కాగా.. రేషన్​ కార్డులో మాత్రం 133 ఏళ్లు అని ముద్రించారు. దీంతో ఆ కుటుంబం వింత సమస్యలు ఎదుర్కొంది. ఆ వింత సమస్యలు ఏంటో.. వారి కథేంటో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Feb 28, 2023, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.