తమిళనాడు మధురైలోని కరుప్పయ్య ముత్తయ్య ఆలయంలో ఇటీవల జరిగిన ఉత్సవాలు వార్తల్లో నిలిచాయి. సంప్రదాయంలో భాగంగా.. పురుషులు మాత్రమే ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. 60 మేకలతో మటన్ వండి.. 7వేల మంది తిన్నారు.
అనుప్పపట్టిలోని కరుప్పయ్య ముత్తయ్య ఆలయంలో ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఈసారి జరిగిన వేడుకల్లో 10 గ్రామాల పురుషులు పాల్గొన్నారు. వారే అన్ని పనులు చేసుకున్నారు. పెద్ద పెద్ద పాత్రల్లో వంటలు వండుకున్నారు. అందరూ కూర్చుని ఆ వంటలను ఆరగించారు.
సంప్రదాయం ప్రకారం.. ఉత్సవాల్లో పాల్గొనకూడదని మహిళలపై నిషేధం ఉన్నట్టు తెలుస్తోంది. పురుషులు తిని పారేసిన అరిటాకులు ఎండిపోయేంత వరకు ఆ పరిసర ప్రాంతాల్లో మహిళలు రాకూడదని ఓ నియమం అక్కడ ఉండటం విశేషం.
ఇదీ చూడండి:- నిమిషానికి 9వేల ఫుడ్ ఆర్డర్లు.. 1229 బిర్యానీల డెలివరీ