ETV Bharat / bharat

బస్సులోనే మకాం.. పదేళ్లు దేశ పర్యటనే పని.. ప్రొఫెసర్ 'వెలుగు'ల ప్రాజెక్ట్! - చేతన్​ సింగ్ సోలంకి

Energy Swaraj Yatra: దేశంలో సౌరశక్తిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ భారీ ప్రాజెక్టును చేపట్టారు బాంబే ఐఐటీ ప్రొఫెసర్​ డాక్టర్​ చేతన్​ సోలంకీ. సోలార్​ ఎనర్జీతో నడిచే ప్రత్యేకమైన బస్సును రూపొందించి అందులో దేశమంతటా పర్యటిస్తున్నారు. ప్రజల్లో పూర్తిస్థాయిలో సౌరశక్తి వినియోగంపై అవగాహన పెంచడమే తన లక్ష్యమని అంటున్నారు సోలంకీ.

్
సౌరశక్తి బస్సుతో ప్రొఫెసర్
author img

By

Published : Mar 27, 2022, 8:07 PM IST

ఎనర్జీ స్వరాజ్​ యాత్ర

Energy Swaraj Yatra: దేశంలో విద్యుత్​ ఉత్పత్తికి డిమాండ్​ రోజురోజుకు పెరుగుతోంది. ఫలితంగా ఆ ప్రభావం పర్యావరణం మీద పడుతోంది. సౌరశక్తి అందుబాటులో ఉన్నా ప్రజలు దానిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలో సౌరశక్తితో ఉన్న లాభాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ పాన్​ ఇండియా ప్రాజెక్టు చేపట్టారు బాంబే ఐఐటీ ప్రొఫెసర్​ డాక్టర్​ చేతన్ సింగ్​ సోలంకీ. ఇందుకోసం ఆయన ఓ ప్రత్యేక బస్సునే తయారు చేశారు. ప్రస్తుతం ఆ బస్సును బెంగళూరులోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​లో ప్రదర్శనకు ఉంచారు.

Energy Swaraj Yatra
ఎనర్జీ స్వరాజ్​ యాత్ర బస్సు
d
బస్సుపైన సోలార్​ ప్యానెల్స్​

ఎనర్జీ స్వరాజ్​ యాత్ర పేరుతో చేతన్​ చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా పూర్తిస్థాయి సౌరశక్తితో నడిచే ఓ ప్రత్యేక బస్సును తీర్చిదిద్దారు. ఇందులోనే ఆయన దేశమంతటా పర్యటిస్తున్నారు. 2020 నవంబరు 26న మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పర్యటనలో ఇప్పటివరకు 473 రోజుల్లో 9,000 కిలోమీటర్లు తిరిగి సుమారు 46వేల మందికి అవగాహన కల్పించినట్లు చేతన్ చెప్పుకొచ్చారు. గంటకు 6 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ బస్సుకు 3.2 కిలోవాట్ల సోలార్​ ప్యానెల్స్​ అమర్చారు. నిద్రపోవడానికి, పనిచేసుకోవడానికి, స్నానం చేసేందుకు ఇలా అన్ని రకాల సదుపాయాలు ఉండేలా సోలంకీ ఈ బస్సును తీర్చిదిద్దారు. సోలంకీ కృషిని గుర్తిస్తూ మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​ ఇటీవల ఆయనను ఆ రాష్ట్ర సౌరశక్తికి బ్రాండ్​ అంబాసిడర్​గా ప్రకటించారు. ఈ ఎనర్జీ స్వరాజ్​ యాత్రను 2030 వరకు నిర్విరామంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు సోలంకీ.

Energy Swaraj Yatra
సోలంకీ రూపొందించిన బస్సు
Energy Swaraj Yatra
ఎనర్జీ స్వరాజ్​ యాత్ర బస్సుతో సోలంకీ

ఈ యాత్రలో భాగంగా 2030 నాటికి దేశవ్యాప్తంగా 2,00,000 కిలోమీటర్ల పర్యటన, 1000 ప్రదర్శనలు, లక్ష మందికి సౌరశక్తిపై ట్రైనింగ్​, 5వేలకుపైగా చర్చా వేదికల నిర్వహణ, లక్ష మొక్కలను నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రొఫెసర్​ వెల్లడించారు. గాంధీ సిద్ధాంతాల స్ఫూర్తితోనే ఈ ఎనర్జీ స్వరాజ్​ యాత్ర ప్రారంభించినట్లు సోలంకీ వెల్లడించారు. విద్యుత్​ ఉత్పత్తిలో కూడా ఆత్మనిర్భర్​ భారత్​ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చూడండి : 'ఫుల్​గా తాగా.. దమ్ముంటే అరెస్ట్ చేయండి'.. పోలీసులకే సవాల్​.. చివరకు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.