ETV Bharat / bharat

భీమా-కోరెగావ్ కేసులో మూడేళ్ల తర్వాత సుధా భరద్వాజ్​ విడుదల - భీమా కోరెగావ్​ నిందితురాలు సుధా భరద్వాజ్​

Sudha Bharadwaj released: భీమా-కోరెగావ్​ కేసులో అరెస్టయిన సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్​ విడుదలయ్యారు. బాంబే హైకోర్టు ఇటీవలే డీఫాల్ట్​ బెయిల్​ మంజూరు చేసిన క్రమంలో మూడేళ్ల తర్వాత బయటకు వచ్చారు.

Sudha Bharadwaj released from jail
సుధా భరద్వాజ్​ విడుదల
author img

By

Published : Dec 9, 2021, 3:16 PM IST

Bhima Koregaon case: భీమా-కోరెగావ్​ కేసులో నిందితురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్​ మూడేళ్ల తర్వాత జైలు నుంచి గురువారం విడుదలయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ముంబయిలోని జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని కుట్ర పన్నారన్న ఆరోపణల కేసులో శిక్ష అనుభవిస్తున్న భరద్వాజ్​కు​ 2021, డిసెంబర్​ 1న బాంబే హైకోర్టు డీఫాల్ట్​ బెయిల్​ మంజూరు చేసింది. డిసెంబర్​ 8న బెయిల్​ ఆంక్షలు, విడుదల తేదీని నిర్ణయించాలని ప్రత్యేక ఎన్​ఐఏ కోర్టును ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు విచారించిన ఎన్​ఐఏ కోర్టు రూ.50వేల పూచీకత్తుతో విడుదల చేసేందుకు ఆదేశించింది.

కోర్టు ఆదేశాలు అందిన తర్వాత.. అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుని గురువారం మధ్యాహ్నం బైకుల్లా మహిళా జైలు నుంచి బయటకు వచ్చారు సుధా భరద్వాజ్​. ఆమె కోసం వేచి ఉన్న మీడియాతో మాట్లాడకుండానే కారులో వెళ్లిపోయారు.

ఇదీ కేసు..

2017, డిసెంబర్​ 31న పుణె షానివార్​వాడాలోని ఎల్గర్​ పరిషద్​ కాన్​క్లేవ్​ వద్ద చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలతో.. ఆ తర్వాతి రోజును భీమా కోరాగావ్​ వార్​ మెమోరియల్​ వద్ద హింసాత్మక ఘటనలు జరిగాయని పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో భాగంగా సుధా భరద్వాజ్​తో పాటు పలువురు హక్కుల నేతలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన పుణె పోలుసు.. వీరి వెనక మావోయిస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ)కు అప్పగించారు. చట్ట వ్యతిరేక చర్యల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద 2018, ఆగస్టులో భరద్వాజ్​ను అరెస్ట్​ చేసింది ఎన్​ఐఏ. తమకు తెలియకుండా ముంబయిని వదిలి వెళ్లొద్దని, పాస్​పోర్ట్​ అప్పగించాలని, ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని ఆంక్షలు విధించింది.

హైకోర్టు డీఫాల్ట్​ బెయిల్​ మంజూరు చేసిన క్రమంలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఎన్​ఐఏ. అయితే, దర్యాప్తు సంస్థ పిటిషన్​ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. భరద్వాజ్​కు బెయిల్​ అర్హురాలని, అందుకు నిరాకరించటం ఆమె ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటమేనని హైకోర్టు పేర్కొంది.

మిగతా వారికి నో..

భీమా-కొరేగావ్ కేసులో అరెస్టైన 16 మంది నిందితుల్లో డీఫాల్ట్​ బెయిల్ పొందిన వారిలో సుధా భరద్వాజ్​ తొలి వ్యక్తి. మరో ఎనిమిది మంది బెయిల్​ పిటిషన్​ను హైకోర్టు తిరస్కరించింది. కవి, సామాజిక కార్యకర్త వరవరరావు ప్రస్తుతం మెడికల్​ బెయిల్​లో ఉన్నారు. మరో నిందితుడు హక్కుల నేత స్టాన్ స్వామి మెడికల్ బెయిల్ కోసం ఎదురుచూస్తున్న క్రమంలో అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 5న మరణించారు. మిగతా వాళ్లంతా ప్రస్తుతం విచారణ ఖైదీలుగా కస్టడీలో ఉన్నారు.

ఇదీ చూడండి: భీమా-కోరెగావ్ కేసులో సుధా భరద్వాజ్​కు బెయిల్​

స్టాన్​ స్వామి మృతిపై రాష్ట్రపతికి విపక్షాల లేఖ

స్టాన్ స్వామి మృతి- కేంద్రంపై విపక్షాల ధ్వజం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.