రంజాన్ పర్వదినాన.. దేశంలో ఏటా కళకళలాడే మసీదులు వరుసగా రెండో ఏడాది నిర్మానుష్యంగా మారాయి. కేరళలో లాక్డౌన్ అమల్లో ఉన్నందున కొచ్చిలోని జుమా మసీదు, పదముగల్ ఈద్-ఉల్-ఫితర్పై తీవ్ర ప్రభావం పడింది. ముస్లింలు ఇంట్లోనే ప్రార్థనలు నిర్వహించుకోవడం వల్ల.. అక్కడి ప్రదేశాలన్నీ గురువారం నిర్జనంగా కనిపించాయి.
కర్ణాటకలో ఈ నెల 24వరకు లాక్డౌన్ విధించడం వల్ల.. మంగళూరు ఎమ్మెల్యే యూటీ ఖాదర్ ఇంట్లోనే ఈద్ ప్రార్థనలు నిర్వహించారు.
కశ్మీర్లో కరోనా కేసులు విజృంభిస్తున్నందున.. నిరాడంబరంగానే ఈద్-ఉల్-ఫితర్ ఉత్సవాలను జరుపుకున్నారు అక్కడి ముస్లింలు.
ఇదీ చదవండి: 'వ్యాక్సిన్లతో పాటు ప్రధాని కూడా కనపడట్లేదు'