ETV Bharat / bharat

2023లో పీజీ వైద్య కోర్సులకు ప్రవేశ పరీక్ష!

2023 ప్రథమార్థంలో వైద్య విద్యార్థులకు నేషనల్​ ఎగ్జిట్​ టెస్ట్​ను(ఎన్​ఈఎక్స్​టీ) నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్​సుఖ్​ మాండవియా నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో జాతీయ వైద్య మండలి(ఎన్​ఎంసీ) వెల్లడించింది.

National Exit Test
నేషనల్​ ఎగ్జిట్​ టెస్ట్
author img

By

Published : Jul 30, 2021, 6:18 PM IST

పీజీ వైద్య కోర్సుల ప్రవేశ పరీక్ష.. నేషనల్​ ఎగ్జిట్​ టెస్ట్​ను(ఎన్​ఈఎక్స్​టీ) 2023 ప్రథమార్ధంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ప్రక్రియను పరీక్షించడానికి, వైద్య విద్యార్థుల్లో ఆందోళనను తొలగించడానికి వచ్చే ఏడాదిలో మాక్​ టెస్ట్​ నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్​సుఖ్​ మాండవీయ నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో జాతీయ వైద్య కమిషన్​(ఎన్​ఎంసీ) వెల్లడించినట్లు తెలిపింది. అలాగే వైద్యవిద్యలోని పలు సమస్యలపై చర్చించినట్లు పేర్కొంది. ఎన్​ఈఎక్స్​టీని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించే దిశగా చర్చలు జరిగినట్లు వెల్లడించింది.

పీజీ వైద్య కోర్సుల్లో ప్రేవేశానికి, సాధన(ప్రాక్టీస్​) కోసం లైసెన్స్​ పొందేందుకు అర్హత కోసం ఎన్​ఈఎక్స్​టీని​ నిర్వహిస్తారు. ఇది విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లకు స్క్రీనింగ్​ పరీక్షగా కూడా పనిచేస్తుంది.

ఇదీ చూడండి: సీబీఎస్​ఈ క్లాస్​-12 ఫలితాలు విడుదల​.. బాలికలే టాప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.