ETV Bharat / bharat

'భాజపా బెదిరింపు వ్యూహాలకు భయపడను' - బంగాల్​ ఎన్నికలు

శాసనసభ ఎన్నికల్లో తనను ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని భాజపా చూస్తోందని బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. దీక్ష ముగింపు సందర్భంగా మాట్లాడిన దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Mamata Banerjee
మమతా బెనర్జీ
author img

By

Published : Apr 14, 2021, 5:57 AM IST

తనను ఎన్నికల ప్రచారం చేయకుండా ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ. ఇలాంటి బెదిరింపు వ్యూహాలకు భయపడను అని వ్యాఖ్యానించారు. భాజపా తీరుపై బంగాల్​ ప్రజలే సరైన తీర్పు ఇస్తారని.. వారు అన్నింటిని గమనిస్తున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల కమిషన్‌ విధించిన 24 గంటల నిషేధాన్ని నిరసిస్తూ దీక్షకు దిగిన దీదీ.. నిషేధం ముగిసిన వెంటనే బరాసత్‌, బిధన్ నగర్ ప్రాంతాల్లో ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఓడిపోతున్నామన్న భయంతోనే కమలం పార్టీ తనను ప్రచారం చేయకుండా అడ్డుకుంటోందని విమర్శించారు. భాజపా నేతలు ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని.. ఆ తీవ్ర వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్‌ పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.