Tamil Nadu Minister ED Raid : తమిళనాడులో మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్ వేడి చల్లారకముందే.. మరో మంత్రి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. సోమవారం ఉదయం చెన్నైలోని ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి, డీఎంకే నేత పొన్ముడి నివాసం సహా ఆయనకు సంబంధించిన మూడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది.
మంత్రి కుమారుడి ఇంటిపై కూడా..
Ponmudi Son Ed Raid : మంత్రి పొన్ముడితో పాటు విల్లుపురంలో ఉంటున్న ఆయన కుమారుడు, ఎంపీ గౌతమ్ చికామణి ఇల్లు, ఆఫీసులో కూడా ఈడీ దాడులు జరిపింది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలోనే ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
-
#WATCH | Enforcement Directorate (ED) officials search Tamil Nadu Higher Education Minister K Ponmudi's residence in Villupuram district. Details awaited. pic.twitter.com/H9bLkYPk7F
— ANI (@ANI) July 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Enforcement Directorate (ED) officials search Tamil Nadu Higher Education Minister K Ponmudi's residence in Villupuram district. Details awaited. pic.twitter.com/H9bLkYPk7F
— ANI (@ANI) July 17, 2023#WATCH | Enforcement Directorate (ED) officials search Tamil Nadu Higher Education Minister K Ponmudi's residence in Villupuram district. Details awaited. pic.twitter.com/H9bLkYPk7F
— ANI (@ANI) July 17, 2023
క్వారీ లైసెన్సుల జారీలో అక్రమాలకు పాల్పడినట్లు..
Ponmudi Case : డీఎంకే అధికారంలో ఉన్న 2007-2011 మధ్యకాలంలో పొన్ముడి.. గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన క్వారీ లైసెన్సుల జారీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అక్రమంగా 2లక్షలకుపైగా ఎర్రచందనం లోడ్లను తరలించినట్లు కూడా ఆరోపణలు వినిపించాయి. నిబంధనలకు వ్యతిరేకంగా లైసెన్స్‌లు జారీ చేయటం వల్ల ప్రభుత్వానికి రూ.28కోట్ల మేర నష్టం వాటిల్లిందని విల్లుపురం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. పొన్ముడి, ఆయన కుమారుడు, తదితరులపై కేసు నమోదు చేశారు. 2012లో మంత్రి పొన్ముడి, జయచంద్రన్ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.
Ponmudi Case Verdict : అయితే ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుండగా.. ట్రయల్‌పై స్టే ఇచ్చి, కేసును కొట్టివేయాలని పొన్ముడి కుమారుడు, ఎంపీ గౌతమ్ మద్రాసు హైకొర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మద్రాసు హైకోర్టు.. ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ తర్వాత 2020లో ఈడీ రంగంలోకి దిగి.. ఎంపీ గౌతమ్‌కు చెందిన రూ.8.6 కోట్ల విలువైన ఆస్తిని అటాచ్ చేసింది. అందులో ఎంపీకి చెందిన వ్యవసాయ భూములు, వాణిజ్య, నివాస భవనాలు, బ్యాంకు ఖాతాలు, షేర్లు ఉన్నాయి.
ఆ కేసులో నిర్దోషిగా..
Ponmudi Case Judgement : 1996 నుంచి 2001 మధ్య డీఎంకే మంత్రిగా ఉన్న సమయంలో పొన్ముడి.. చెన్నైలోని సైదాపేటలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో పొన్ముడితోపాటు మరో ఆరుగురిపై డెరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఏసీ) కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇటీవలే ఆయన నిర్దోషిగా తేలారు.
విపక్షాల సమావేశంపై ఉన్న దృష్టిని మళ్లించేందుకే..
Ponmudi Stalin Ed Raid : మంత్రి పొన్ముడి ఇంటిపై జరిగిన ఈడీ దాడులపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. "పొన్ముడిపై ఉన్న రెండు కేసులను ఇటీవలే కోర్టు కొట్టివేసింది. ఈ కేసును కూడా ఆయన న్యాయపరంగా ఎదుర్కొంటారు. ఈడీ దాడి.. ప్రతిపక్షాల సమావేశంపై ఉన్న దృష్టిను మళ్లించే వ్యూహంలో భాగమే. ఇప్పటికే గవర్నర్ మనకు(డీఎంకే) ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈడీ కూడా అందులో చేరింది. దేశంలో ఇది మామూలే.. వారు(బీజేపీ) ఆడుతున్న నాటకమే" అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
-
Tamil Nadu CM MK Stalin says, "Recently, 2 cases against Ponmudi have been dismissed. He will face this case legally. This raid is a diversion tactic against the Opposition meeting. Governor is already doing election propaganda for us (DMK) and now ED is also doing election… https://t.co/chrHaM7NMb pic.twitter.com/5KrBx1ohbX
— ANI (@ANI) July 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tamil Nadu CM MK Stalin says, "Recently, 2 cases against Ponmudi have been dismissed. He will face this case legally. This raid is a diversion tactic against the Opposition meeting. Governor is already doing election propaganda for us (DMK) and now ED is also doing election… https://t.co/chrHaM7NMb pic.twitter.com/5KrBx1ohbX
— ANI (@ANI) July 17, 2023Tamil Nadu CM MK Stalin says, "Recently, 2 cases against Ponmudi have been dismissed. He will face this case legally. This raid is a diversion tactic against the Opposition meeting. Governor is already doing election propaganda for us (DMK) and now ED is also doing election… https://t.co/chrHaM7NMb pic.twitter.com/5KrBx1ohbX
— ANI (@ANI) July 17, 2023