ETV Bharat / bharat

ED Raids In Rajasthan : గహ్లోత్ కుమారుడు, పీసీసీ చీఫ్ టార్గెట్​.. ఎన్నికల వేళ ఈడీ దాడులు

ED Raids In Rajasthan : అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాజస్థాన్​ పీసీసీ చీఫ్​ గోవింద్‌సింగ్‌తోపాటు ఆ పార్టీకి చెందిన కొందరు నేతల నివాసాల్లో ఈడీ దాడులు చేపట్టింది. మరోవైపు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ కుమారుడికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ విషయంపై గహ్లోత్​, కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. బీజేపీపై విమర్శలు గుప్పించారు.

ED Raids In Rajasthan
ED Raids In Rajasthan
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2023, 11:14 AM IST

Updated : Oct 26, 2023, 1:48 PM IST

ED Raids In Rajasthan : శాసనసభ ఎన్నికల వేళ రాజస్థాన్‌లో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. పేపర్‌ లీకేజీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్‌తోపాటు ఆ పార్టీకి చెందిన కొందరు నేతల నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ దాడులు నిర్వహించింది.

గతంలో రాజస్థాన్‌ విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన గోవింద్‌ సింగ్‌కు చెందిన శికర్‌, జయపురతోపాటు మహువాలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓంప్రకాశ్‌ హుడ్లా, మరికొందరు నేతల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. జూన్‌లో ఈ కేసుకు సంబంధించి మొదటిసారి రాజస్థాన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఈడీ అధికారులు.. బాబూలాల్‌ కటారా, అనిల్‌కుమార్‌ మీనా అనే ఇద్దర్నీ అరెస్ట్‌ చేశారు.

  • VIDEO | ED conducts searches at premises linked to Rajasthan Congress chief Govind Singh Dotasra in Sikar. More details are awaited. pic.twitter.com/bYTkH289GY

    — Press Trust of India (@PTI_News) October 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీఎం కుమారుడికి సమన్లు
ED Summons Rajasthan CM Son : మరోవైపు, రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కుమారుడు వైభవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్‌కు ఈ సమన్లు అందినట్లు తెలిసింది. ఈ కేసులో వైభవ్‌ను ప్రశ్నించేందుకు అక్టోబరు 27న దర్యాప్తు సంస్థ ఎదుట హాజరుకావాలని ఈడీ పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు.

  • दिनांक 25/10/23

    राजस्थान की महिलाओं के लिए कांग्रेस की गारंटियाँ लॉंच

    दिनांक 26/10/23

    -राजस्थान कांग्रेस अध्यक्ष गोविन्द सिंह जी डोटासरा के यहाँ ED की रेड

    - मेरे बेटे वैभव गहलोत को ED में हाज़िर होने का समन

    अब आप समझ सकते हैं, जो मैं कहता आ रहा हूँ कि राजस्थान के अंदर ED की… pic.twitter.com/6hUbmCHCW1

    — Ashok Gehlot (@ashokgehlot51) October 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'అందుకే బీజేపీ ఎర్ర గులాబీలు పంపిస్తోంది'
అయితే, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈడీ ఇలా సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు. "అక్టోబరు 25న, రాజస్థాన్‌ మహిళల కోసం కాంగ్రెస్‌ హామీలు ప్రకటించింది. ఆ మరుసటి రోజు అక్టోబరు 26న రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌పై ఈడీ దాడులకు దిగింది. నా కుమారుడు వైభవ్‌కు సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో మహిళలు, రైతులు, పేదలు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల ప్రయోజనాలను పొందాలని బీజేపీ కోరుకోవడం లేదు. అందుకే ఇలా ఈడీతో ఇలా 'ఎర్ర గులాబీలు' పంపిస్తోందని నేను చాలా సార్లు చెప్పాను. నా మాటలు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటాయి" అని గహ్లోత్‌ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

'దేశంలో గూండాగిరీ.. ఒత్తిడి లేకపోతే ఈడీ రాదు'
దేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా.. అక్కడ ఈడీ దాడులు జరుగుతాయని రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్ ఆరోపించారు. దేశంలో బీజేపీ బీభత్సం సృష్టించిదని మండిపడ్డారు. బీజేపీ ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్​ భయపడదని.. ఎన్నికల్లో తప్పక గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్​లో తన ప్రభుత్వాన్ని పడగొట్టలేక వివిధ రకాల్లో టార్గెట్​ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏజెన్సీల దుర్వినియోగం సమర్థించకూడదని అన్నారు. దేశంలో గూండాగిరీ ఉందని.. పైస్థాయి నుంచి ఒత్తిడి లేకపోతే ఈడీ, సీబీఐ రాష్ట్రాలకు రావని విమర్శించారు.

  • #WATCH | "...Gundagardi hai yeh...Without pressure from the top neither ED nor CBI can come..," says Rajasthan CM Ashok Gehlot on BJP as ED raids continue on his state minister Govind S Dotasra." pic.twitter.com/y4hOayGH9U

    — ANI (@ANI) October 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ప్రజాస్వామ్యానికి మోదీ ప్రభుత్వ నియంతృత్వం ప్రాణాంతకరం'
రాజస్థాన్​ పీసీసీ చీఫ్​ ఇంట్లో ఈడీ సోదాలు జరపడంపై కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఎన్నికలు సమీపస్తున్న నేపథ్యంలో.. ఈడీ, సీబీఐ.. బీజేపీకి నిజమైన 'పేజ్​ ప్రముఖ్​'గా మారాయని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా బీజేపీపై మండిపడ్డారు. "ఎన్నికలు సమీపిస్తుండడం వల్ల ఈడీ, సీబీఐలు.. భారతీయ జనతా పార్టీకి నిజమైన 'పేజ్ ప్రముఖ్​'గా మారాయి. రాజస్థాన్​లో ఓటమిని ముందే ఊహించి బీజేపీ చివరి ఎత్తుగడ వేసింది. ఛత్తీస్‌గఢ్ తర్వాత.. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేపడుతున్న వేళ కాంగ్రెస్​ నేతలపై ఈడీ దాడులు ప్రారంభించింది. ప్రజాస్వామ్యానికి మోదీ ప్రభుత్వ నియంతృత్వం ప్రాణాంతకరం. ఏజెన్సీల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం. బీజేపీకి త్వరలోనే ప్రజలు తగిన సమాధానం చెబుతారు" అంటూ ఆయన ట్వీట్​ చేశారు.

  • चुनाव आते ही ED, CBI, IT आदि भाजपा के असली 'पन्ना प्रमुख' बन जाते हैं।

    राजस्थान में अपनी निश्चित हार को देखते हुए भारतीय जनता पार्टी ने चला अपना आख़िरी दाँव !

    ED ने छत्तीसगढ़ के बाद राजस्थान में भी विधानसभा चुनाव अभियान में उतरते हुए कांग्रेसी नेताओं के ख़िलाफ़ कार्रवाई शुरू…

    — Mallikarjun Kharge (@kharge) October 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

BJP Candidate List 2023 Rajasthan : బీజేపీ రెండో జాబితాలో వసుంధరకు చోటు.. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. గహ్లోత్, పైలట్ స్థానాలు ఇవే

Diya Kumari Vs Vasundhara Raje : ఎవరీ 'దియ'?.. వసుంధరకు ప్రత్యామ్నాయం కాగలరా? రాజస్థాన్​లో బీజేపీ మాస్టర్​ ప్లాన్!

Last Updated : Oct 26, 2023, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.